IPL 2027 Retention: రిటెన్షన్ తర్వాత మారిన లెక్కలు.. పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?
IPL 2027 Retention: ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు 10 ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాలను ఖరారు చేశాయి. దిగ్గజ కెప్టెన్ ధోనీని వదిలి చెన్నై సంచలనం సృష్టించగా, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ కీలక మార్పులు చేశాయి. ఏ జట్టు ఎవరిని నిలుపుకుంది, వదులుకుంది, పర్సులో ఎంత మిగిలిందో ఇప్పుడు చూద్దాం..

IPL 2027 Retention: ఎట్టకేలకు వేచి చూసిన సమయం రానే వచ్చింది. ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు రిటెన్షన్ పర్వం అధికారికంగా ముగిసింది. పది ఫ్రాంచైజీలు తమ కోర్ గ్రూప్‌ను ఖరారు చేసుకున్నాయి. కొన్ని జట్లు స్థిరత్వానికే పట్టం కట్టగా, మరికొన్ని జట్లు జేబు నిండా డబ్బుతో వేలంలోకి దిగేందుకు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈసారి రిటెన్షన్‌లో అతిపెద్ద వార్త ఒక్కటే – చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీని రిలీజ్ చేయడం. రూ.4 కోట్లకు ధోనీని వదిలిపెట్టిన చెన్నై, ఆయనను మెంటార్‌గా కొనసాగించనుంది. దీంతో ఓ యుగానికి తెరపడినట్లేననే భావన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
ధోనీతో పాటు ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వంటి స్టార్లు కూడా వేలంలోకి రానున్నారు. ఎవరు ఎవరిని అట్టిపెట్టుకున్నారు. ఎవరిని వదిలేశారు, ఏ జట్టు వద్ద ఎంత పర్సు మిగిలిందనే పూర్తి లెక్కలు ఓసారి చూద్దాం..
1.చెన్నై సూపర్ కింగ్స్ (CSK)..
ప్రస్తుత జట్టు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, కార్తిక్ శర్మ, నూర్ అహ్మద్, ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అన్షుల్ కాంబోజ్, అకేల్ హొసైన్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, రాహుల్ చాహర్, శ్రేయస్ గోపాల్, లియామ్ లివింగ్‌స్టోన్ (ట్రేడ్), జాక్ ఎడ్వర్డ్స్ (ట్రేడ్).
విడుదల చేసిన ఆటగాళ్లు: ఎంఎస్ ధోనీ (రూ.4 కోట్లు), ప్రశాంత్ వీర్ (రూ.14.2 కోట్లు), మాట్ హెన్రీ (రూ.2 కోట్లు), స్పెన్సర్ జాన్సన్ (రూ.1.5 కోట్లు).
– మిగిలిన పర్స్: రూ.28.05 కోట్లు
– ఖాళీ స్లాట్లు: 6 (2 విదేశీ ఆటగాళ్లు)
2. ముంబై ఇండియన్స్ (MI)..
ప్రస్తుత జట్టు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ (ట్రేడ్), అశ్వని కుమార్, కార్బిన్ బోష్, మిచెల్ సాంట్నర్, నమన్ ధీర్, క్వింటన్ డి కాక్, రఘు శర్మ, రాజ్ అంగద్ బావా, ర్యాన్ రికెల్టన్, శార్దూల్ ఠాకూర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, తిలక్ వర్మ, విల్ జాక్స్.
విడుదల చేసిన ఆటగాళ్లు: ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు), దీపక్ చాహర్ (రూ.9.25 కోట్లు), ఏఎం ఘజన్ఫర్ (రూ.4.8 కోట్లు), అథర్వ అంకోలేకర్ (రూ.30 లక్షలు), కేశవ్ మహరాజ్ (రూ.75 లక్షలు), దానిష్ మలేవార్ (రూ.30 లక్షలు), మయాంక్ మార్కండే (రూ.30 లక్షలు), మయాంక్ రావత్ (రూ.30 లక్షలు), మహమ్మద్ ఇజార్ (రూ.30 లక్షలు).
– మిగిలిన పర్స్: రూ.32.6 కోట్లు
– ఖాళీ స్లాట్లు: 9 (2 విదేశీ ఆటగాళ్లు)
3. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)..
ప్రస్తుత జట్టు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, కామెరూన్ గ్రీన్, ఫిన్ అలెన్, హర్షిత్ రాణా, కార్తిక్ త్యాగి, మనీష్ పాండే, ప్రశాంత్ సోలంకి, రామ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సార్థక్ రంజన్, సౌరభ్ దూబే, సునీల్ నరైన్, టిమ్ సీఫర్ట్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
విడుదల చేసిన ఆటగాళ్లు: మతీష పతిరణ (రూ.18 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ.9.2 కోట్లు), తేజస్వి సింగ్ దహియా (రూ.3 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.2 కోట్లు), అజింక్య రహానే (రూ.1.5 కోట్లు), ఆకాశ్ దీప్ (రూ.1 కోటి), బ్లెసింగ్ ముజరబానీ (రూ.75 లక్షలు), నవదీప్ సైనీ (రూ.75 లక్షలు), రాహుల్ త్రిపాఠి (రూ.75 లక్షలు), ఉమ్రాన్ మాలిక్ (రూ.75 లక్షలు), దక్ష్ కమ్రా (రూ.30 లక్షలు), లువినిత్ సిసోడియా (రూ.30 లక్షలు).
– మిగిలిన పర్స్: రూ.41.65 కోట్లు
– ఖాళీ స్లాట్లు: 8 (3 విదేశీ ఆటగాళ్లు)
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)..
ప్రస్తుత జట్టు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, జితేష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, దేవదత్ పడిక్కల్, నవీన్ తుషారా, వెంకటేశ్ అయ్యర్, జాకబ్ డఫీ, జోర్డాన్ కాక్స్, రసిక్ సలామ్ దార్, సుయాష్ శర్మ, విక్కీ ఓస్త్వాల్, అభినందన్ సింగ్, కౌశిక్ చౌహాన్, యశ్ దయాల్.
విడుదల చేసిన ఆటగాళ్లు: మంగేశ్ యాదవ్ (రూ.5.2 కోట్లు), జాకబ్ బెథెల్ (రూ.2.6 కోట్లు), రిచర్డ్ గ్లీసన్ (రూ.1.6 కోట్లు), సాత్విక్ దేశ్వాల్ (రూ.30 లక్షలు), విహాన్ మల్హోత్రా (రూ.30 లక్షలు).
– మిగిలిన పర్స్: రూ.14.15 కోట్లు
– ఖాళీ స్లాట్లు: 5 (1 విదేశీ ఆటగాడు)
5. పంజాబ్ కింగ్స్ (PBKS)..
ప్రస్తుత జట్టు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కస్ స్టోయినిస్, విష్ణు వినోద్, బెన్ ద్వార్షుయిస్, ముషీర్ ఖాన్, వైశాక్ విజయ్‌కుమార్, కూపర్ కాన్నోలీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జేవియర్ బార్ట్లెట్, హార్దిక్ పాండ్యా (ట్రేడ్), ప్రియాన్ష్ ఆర్య, యశ్ ఠాకూర్, హర్నూర్ పన్ను, శశాంక్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, సూర్యాన్ష్ షెడ్గే.
విడుదల చేసిన ఆటగాళ్లు: నేహల్ వధేరా (రూ.4.2 కోట్లు), మిచెల్ ఓవెన్ (రూ.3 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2 కోట్లు).
– మిగిలిన పర్స్: రూ.18.6 కోట్లు
– ఖాళీ స్లాట్లు: 6 (2 విదేశీ ఆటగాళ్లు)
6. గుజరాత్ టైటాన్స్ (GT)..
ప్రస్తుత జట్టు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అనుజ్ రావత్, కగిసో రబాడ, రాహుల్ తెవాటియా, అశోక్ శర్మ, కుమార్ కుశాగ్ర, రషీద్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, మానవ్ సుతార్, సాయి సుదర్శన్, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ (ట్రేడ్), మహమ్మద్ అర్షద్ ఖాన్, టామ్ బాంటన్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, జోస్ బట్లర్, ఆర్. సాయి కిశోర్.
విడుదల చేసిన ఆటగాళ్లు: షారుఖ్ ఖాన్ (రూ.4 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ.75 లక్షలు), ల్యూక్ వుడ్ (రూ.2.4 కోట్లు), కుల్వంత్ ఖెజ్రోలియా (రూ.30 లక్షలు).
– మిగిలిన పర్స్: రూ.8.75 కోట్లు
– ఖాళీ స్లాట్లు: 3 (2 విదేశీ ఆటగాళ్లు)
7. రాజస్థాన్ రాయల్స్ (RR)..
ప్రస్తుత జట్టు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: అమన్ రావు పెరాలా, బ్రిజేష్ శర్మ, దసున్ షనక, ధ్రువ్ జురెల్, డొనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, మణిమారన్ సిద్ధార్థ్ (ట్రేడ్), మహమ్మద్ షమీ (ట్రేడ్), నాండ్రే బర్గర్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, శుభమ్ దూబే, సుశాంత్ మిశ్రా, వైభవ్ సూర్యవంశీ, యశ్ రాజ్ పంజా, యశస్వి జైస్వాల్.
విడుదల చేసిన ఆటగాళ్లు: షిమ్రోన్ హెట్మయర్ (రూ.11 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ.6.5 కోట్లు), ఆడమ్ మిల్నే (రూ.2.4 కోట్లు), క్వేనా మఫాకా (రూ.1.5 కోట్లు).
– మిగిలిన పర్స్: రూ.27.05 కోట్లు
– ఖాళీ స్లాట్లు: 6 (3 విదేశీ ఆటగాళ్లు)
8. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)..
ప్రస్తుత జట్టు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, బ్రైడన్ కార్స్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, స్మరణ్ రవిచంద్రన్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్, క్రాన్స్ ఫులేట్రా, ఈషాన్ మలింగా, టి. నటరాజన్ (ట్రేడ్), నాథన్ ఎల్లిస్ (ట్రేడ్), ఖలీల్ అహ్మద్ (ట్రేడ్).
విడుదల చేసిన ఆటగాళ్లు: ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), గెరాల్డ్ కోయెట్జీ (రూ.2 కోట్లు), జయదేవ్ ఉనద్కట్ (రూ.1 కోటి).
– మిగిలిన పర్స్: రూ.40.15 కోట్లు
– ఖాళీ స్లాట్లు: 7 (3 విదేశీ ఆటగాళ్లు)
9. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)..
ప్రస్తుత జట్టు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: అబ్దుల్ సమద్, దిగ్వేశ్ రాఠీ, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్, జోష్ ఇంగ్లిస్, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, కుల్దీప్ యాదవ్ (ట్రేడ్), సామ్ కరన్ (ట్రేడ్), అక్షత్ రఘువంశీ, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, అర్జున్ టెండూల్కర్, మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి.
విడుదల చేసిన ఆటగాళ్లు: అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు), అన్రిచ్ నోర్ట్జే (రూ.2 కోట్లు), వనిందు హసరంగ (రూ.2 కోట్లు).
– మిగిలిన పర్స్: రూ.47.45 కోట్లు
– ఖాళీ స్లాట్లు: 7 (3 విదేశీ ఆటగాళ్లు)
10. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
ప్రస్తుత జట్టు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, కైల్ జేమీసన్, లుంగీ ఎంగిడి, మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, పృథ్వీ షా, రిషభ్ పంత్ (ట్రేడ్), సమీర్ రిజ్వీ, త్రిపురాన విజయ్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, జీషన్ అన్సారీ (ట్రేడ్).
విడుదల చేసిన ఆటగాళ్లు: మిచెల్ స్టార్క్ (రూ.11.75 కోట్లు), నితీష్ రాణా (రూ.4.2 కోట్లు), పాథుమ్ నిస్సంక (రూ.4 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ.4 కోట్లు).
– మిగిలిన పర్స్: రూ.39.5 కోట్లు
– ఖాళీ స్లాట్లు: 9 (4 విదేశీ ఆటగాళ్లు)
ఈసారి వేలంలో లక్నో, కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీ జట్లదే హవా కానుంది. హెడ్, స్టార్క్, బౌల్ట్, ధోనీ వంటి పేర్లు వేలంలోకి రావడంతో ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీ తప్పదు. చెన్నై ధోనీ స్థానాన్ని ఎలా భర్తీ చేస్తుందో, ముంబై పేస్ దళాన్ని ఎలా నిర్మిస్తుందో చూడాలి. అలాగే రిటెన్షన్ తర్వాత ముంబై టీం మోస్ట్ పవర్ ఫుల్ టీంగా కనిపిస్తుండగా.. చెన్నై, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలు వరస్ట్ టీంలుగా మారాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
