AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 సినిమాలు చేస్తే 8 ఫ్లాపులు.. ఇన్ స్టా గ్రామ్‌తో రోజు రూ. 10లక్షలు సంపాదిస్తున్న బ్యూటీ

సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమా అప్డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంటారు. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా సెలబ్రెటీలు గట్టిగానే సంపాదిస్తున్నారు. బ్రాండ్ ప్రమోషన్స్ తో లక్షలు సంపాదిస్తున్నారు హీరోయిన్స్

11 సినిమాలు చేస్తే 8 ఫ్లాపులు.. ఇన్ స్టా గ్రామ్‌తో రోజు రూ. 10లక్షలు సంపాదిస్తున్న బ్యూటీ
Sreeleela
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2026 | 11:17 AM

Share

సినిమా హీరోయిన్స్ చాలా మంది సోషల్ మీడియాతో ఎక్కువ పాపులర్ అవుతుంటారు. సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు టచ్ లో ఉంటారు. మాములుగానే సినీ సెలబ్రెటీలకు క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆ క్రేజ్ డబుల్ ఉంటుంది. అయితే హీరోయిన్స్ కేవలం సినిమాలతోనే కాదు సోషల్ మీడియాతోనూ గట్టిగానే సంపాదిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ కూడా వచ్చింది. చాలా మంది పైసలు కట్టి ఎక్స్ క్లూజివ్ కంటెంట్ చూడండి అంటూ నెటిజన్స్ కు ఆఫర్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ముద్దుగుమ్మ కేవలం ఇన్ స్టా గ్రామ్ తోనే లక్షలు సంపాదిస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ దాదాపు నిరాశపరిచాయి కానీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. సినిమాలతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాతోనూ లక్షలు సంపాదిస్తుంది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు

ఇవి కూడా చదవండి

చాలా మంది సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోషన్స్ తో కోట్లల్లో సంపాదిస్తున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ప్రతి నెలా 30 నుంచి 50 లక్షల రూపాయల సంపాదిస్తుంది. ఆమె మరెవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీలీల. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల తెలుగులో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది.

ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నపటికీ ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ మాత్రం రాలేదు. అప్పుడెప్పుడో వచ్చిన ధమాకా, భగవంత్ కేసరి సినిమాలు తప్ప ఈ అమ్మడి ఖాతాలో పెద్దగా హిట్స్ లేవు. తెలుగులోనే కాదు తమిళ్, హిందీలోనూ అదృష్టం పరీక్షించుకుంటుంది ఈ చిన్నది. ఇప్పటికే తమిళ్ లో ఓ సినిమా చేసింది కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే శ్రీలీల సినిమాతో పాటు సోషల్ మీడియాతోనూ గట్టిగానే సంపాదిస్తుంది. ఈ అమ్మడి ఇన్ స్టాలో 17 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాలో శ్రీలీల బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది. ఈ ప్రమోషన్స్ తో రోజుకు రూ. 5 లక్షల నుంచి రూ. 10లక్షల వరకు అందుకుంటుంది. ఇలా నెలకు రూ. 30లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు సంపాదిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Bigg Boss 10 : నన్ను బిగ్ బాస్‌కు పంపండి.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా..! బషీర్ మాస్టర్ వీడియో

View this post on Instagram

A post shared by SREELEELA (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us