Krishna Last Rites: సూపర్ స్టార్ కృష్ణ పాడే మోసిన మురళి మోహన్.. స్నేహితుడితో గడిపిన జ్ఞాపకాలు తలుచుకొని ఎమోషనల్..
అశేష అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల నడుమ సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన తెలుగు సినిమా స్థాయిని పెంచిన కృష్ణ దివికేగారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిలిమ్‌నగర్‌లో ఉన్న మహా ప్రస్థానంలో కృష్ణ..
అశేష అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల నడుమ సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన తెలుగు సినిమా స్థాయిని పెంచిన కృష్ణ దివికేగారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిలిమ్‌నగర్‌లో ఉన్న మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. అంతకుముందు పద్మాలయ స్టూడియోస్ నుంచి మహా ప్రస్థానానికి కృష్ణ అంతిమ యాత్ర సాగింది.
ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు అభిమానులు పొటేత్తారు. దారి పొడవునా నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ కూడా అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కృష్ణ పాడే మోసిన మురళి మోహన్ ఎమోషనల్ అయ్యారు. చిత్ర సీమలో మురళి మోహన్, కృష్ణ దాదాపు ఒకే సమయంలో ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉన్న విషయం తెలిసిందే. సూపర్ కృష్ణ మరణ వార్త వినగానే మురళీ మోహన్ ఎమోషన్‌కు గురయ్యారు.
మంగళవారం కృష్ణ పార్ధివ దేహాన్ని సందర్శించిన తర్వాత మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు సినిమా పరిశ్రమకే కాకుండా అఖండ అభిమానులకు దుర్ధినం. కృష్ణ గారు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. పెద్ద నాయకులంతా వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. కృష్ణ గారితో నా పరిచయం 66 ఏళ్లు. 1956లో ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలు కృష్ణగారు నేను కలిసి ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం’ అని గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..