AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: దండ యోగతో ఇరగదీస్తున్న బీటౌన్ బ్యూటీ.. తన అందాల రహస్యం ఇదేనంటూ వీడియో షేర్..

బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడే యోగా ఆసనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దండ యోగాతో ఆమె చేస్తున్న ప్రాక్టీస్‌ను చూసిన ఫ్యాన్స్ అదరహో అంటున్నారు

Weight Loss: దండ యోగతో ఇరగదీస్తున్న బీటౌన్ బ్యూటీ.. తన అందాల రహస్యం ఇదేనంటూ వీడియో షేర్..
Danda Yoga
Sanjay Kasula
|

Updated on: Nov 16, 2022 | 3:21 PM

Share

ఛల్‌..ఛయ్యా..ఛయ్యా…’, ‘మున్నీ బద్నామ్‌’ ..ఇలాంటి అదిరిపోయే స్పెషల్ సాంగ్స్‌తో అభిమానుల మనసు దోచుకున్న బాలీవుడ్‌ అందం మలైకా అరోరా. తన అందానికి మరిన్ని మెరుగులు దిద్దుకుంటుంది మలైకా అరోరా. తన ఫిట్‌నెస్‌పై ఎంత మక్కువ ప్రధాన్యత ఇస్తుందో మనందరికీ తెలిసిందే. మలైకా ఫిట్‌గా ఉండటానికి యోగా చేస్తుంది. ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఆమె భంగిమలను షేర్ చేస్తుంది. ఆమె తరచుగా సోషల్ మీడియాలో కష్టమైన యోగా భంగిమలు చేస్తూ కనిపిస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో డిఫరెంట్ యోగా చేస్తూ మరోసారి వార్తల్లోకి వచ్చింది. మలైకా “అద్భుతమైన మండే వర్కౌట్” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసింది. ఈ వ్యాయామంలో ఆమె వెదురు కర్రతో యోగా(దండ యోగ) చేస్తూ కనిపించింది.  49 ఏళ్ల బీ టౌన్ బ్యూటీ యోగా చేయడం ద్వారా తనను తాను ఫిట్‌గా, యవ్వనంగా కనిపించేందుకు ట్రై చేస్తుంటారు. మలైకా లాగా మీరు కూడా ఎక్కువ కాలం యవ్వనంగా, అందంగా కనిపించాలంటే యోగా చేయండి. కొన్ని యోగాసనాలు త్వరగా బరువు తగ్గిస్తాయి. మలైకా అరోరా లాగా, మీరు కూడా బరువు తగ్గడానికి మరియు బొడ్డు కొవ్వును కాల్చడానికి దండ యోగా చేయవచ్చు. ఈ యోగా బెల్లీ ఫ్యాట్‌ని ఎలా తొలగిస్తుందో తెలుసుకుందాం.

దండ యోగాతో మలైకా సైడ్ ఫ్యాట్‌ని ఎలా నియంత్రించింది:

49 ఏళ్ల వయస్సులో మలై అరోరా తన ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ చూపుతుంది. ఈ యోగాతో అందరి శబాష్ అనిపించుకుంటున్నారు. ఈ యోగా సహాయంతో మలైకా తన శరీరంలోని సైడ్ ఫ్యాట్ ను తగ్గించుకోవాలనుకుంటోంది ఇందులో చూడండి.

దండ యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి:

  • ముఖ్యంగా నడుము చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించేందుకు ఇది చక్కటి వ్యాయామం.
  • ఇలా చేయడం వల్ల చేతులు, కాళ్లు, వెన్నెముక కండరాలు ఎక్కువగా సాగుతాయి.
  • ఇలా చేయడం వల్ల శరీరం పూర్తిగా రిలాక్స్‌గా ఉంటుంది.
  • దండయోగ శిక్షకులు చెప్పటినట్లుగా.. శ్వాస ప్రక్రియను దండ యోగా నియంత్రిస్తుంది. ఈ ఆసనం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం