AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: అదిరిపోయిన మహేష్‌ కొత్త లుక్‌.. పోనీటెయిల్‌, గడ్డంతో రచ్చ అంతే..

ప్రస్తుతం మహేష్‌ రాజమౌళి చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కోసమే మహేష్‌ తన పూర్తి లుక్‌ను మార్చేశారు. ఇటీవల ముంబయిలో జరిగిన అనంత్‌ అంబానీ వివాహ వేడుకల్లో కనిపించిన మహేష్‌ అందరి దృష్టిని ఆకర్షించారు...

Mahesh Babu: అదిరిపోయిన మహేష్‌ కొత్త లుక్‌.. పోనీటెయిల్‌, గడ్డంతో రచ్చ అంతే..
Mahesh Babu
Narender Vaitla
|

Updated on: Aug 11, 2024 | 3:16 PM

Share

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబుకు ఉండే క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన సినిమా. మాస్‌, ఫ్యామిలీ, యూత్‌ ఇలా అన్ని వర్గాల ప్రజలను అట్రాక్ట్ చేసేలా ఉంటాయి మహేష్‌ సినిమాలు. సినిమా సినిమాకు తన లుక్‌ను మార్చుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు మహేష్‌. ఈ క్రమంలోనే తాజాగా మహేష్‌ కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా తాజాగారు. తాజాగా మహేష్‌ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం మహేష్‌ రాజమౌళి చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కోసమే మహేష్‌ తన పూర్తి లుక్‌ను మార్చేశారు. ఇటీవల ముంబయిలో జరిగిన అనంత్‌ అంబానీ వివాహ వేడుకల్లో కనిపించిన మహేష్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. హెయిర్‌ స్టైల్‌లతో పాటు గడ్డం పెంచుతున్నారు మహేష్‌. అయితే తాజాగా కనిపించిన కొత్త లుక్‌లో హెయిర్‌ మరింత పెంచారు. అలాగే గుబురు గడ్డంతో గతంలో ఎన్నడూ చూడని మహేష్‌ కనిపిస్తున్నారు.

తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లారు మహేష్‌. బర్త్‌డే వేడుకలు పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇదే సమయంలో జైపూర్ ఎయిర్‌ పోర్ట్‌లో కుటుంబ సభ్యులతో కలసి కనిపించారు. ఆ సమయంలో మహేష్‌ పూర్తిగా కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. పోనీ టెయిల్‌, గుబురు గడ్డంతో సరికొత్త మహేష్‌లా కనిపిస్తున్నారు. దీనిని అక్కడే ఉన్న కొందరు అభిమానులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా వీడియో కాస్త వైరల్‌గా మారింది.

మహేష్ కొత్త లుక్..

దీంతో మహేష్‌ కొత్త లుక్‌ చూసిన ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా పూర్తి స్థాయిలో మాస్‌ లుక్‌లో కనిపిస్తుండడంతో వావ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా రాజమౌళి, మహేష్‌ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగనుందని ప్రచారం జరిగిన ఇషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఒక్క భారత్‌లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాకు మహారాజ్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై