Thalavan OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇటీవలి రోజులలో అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులో తలవన్ ఒకటి. ఆసిఫ్ అలీ, బీజూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ మే 24న థియేటర్లలో విడుదలైంది. జిస్ జాయ్ దర్శకత్ం వహించిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది.

Thalavan OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
Thalavan Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 11, 2024 | 3:09 PM

మలయాళంలో చిన్న సినిమాలుగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలు చాలా ఉన్నాయి. ఇటీవలి రోజులలో అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులో తలవన్ ఒకటి. ఆసిఫ్ అలీ, బీజూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ మే 24న థియేటర్లలో విడుదలైంది. జిస్ జాయ్ దర్శకత్ం వహించిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయ్యింది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీలివ్ లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషలలో ఈమూవీ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 12 నుంచి సోనీల్ివ్ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లో విడుదలైన 80 రోజుల తర్వాత ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ, బిజూ మీనన్, మియా జార్జ్, దిలీశ్ పోతన్, అనుశ్రీ, సుజీత్ శంకర్, శంకర్ రామకృష్ణన్, రంజిత్ కీలకపాత్రలు పోషించారు. ఓ హత్య కేసులో పోలీస్ చిక్కుకోవడం, దర్యాప్తు జరగడం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

ఆద్యంతం ట్విస్టులతో, థ్రిల్లింగ్ గా ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రాన్ని అరుణ్ నారాయణ్ ప్రొడక్షన్స్, లండన్ స్టూడియోస్ పతాకంపై అరుణ్ నారాయణ్, సిజో సెబాస్టియన్ నిర్మించారు. ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందించారు. శరణ్ వెలాయుధన్ సినిమాటోగ్రఫీ చేయగా.. సూరజ్ ఈఎస్ ఎడిటింగ్ చేశారు. ఈ సినిమా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.