Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAA cinemas: ప్రారంభానికి సిద్ధమైన అల్లు అర్జున్‌ మల్టీప్లెక్స్‌.. ఆ సినిమాతోనే ఓపెనింగ్‌.?

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు వ్యాపారాల్లో రాణిస్తూ సత్తాచాటుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ కూడా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే రెస్టారెంట్‌తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టిన బన్నీ..

AAA cinemas: ప్రారంభానికి సిద్ధమైన అల్లు అర్జున్‌ మల్టీప్లెక్స్‌.. ఆ సినిమాతోనే ఓపెనింగ్‌.?
Allu Arjun
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 11, 2023 | 8:22 AM

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు వ్యాపారాల్లో రాణిస్తూ సత్తాచాటుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ కూడా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే రెస్టారెంట్‌తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టిన బన్నీ.. మల్టీప్లెక్స్‌ రంగంలోకి కూడా అడుగుపెడుతోన్న విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో కలిసి బన్నీ ఓ భారీ మల్టీప్లెక్స్‌ నిర్మిస్తున్న విషయం విధితమే. అమీర్‌పేట్‌ సత్యం థియేటర్‌ను కూల్చేసి ‘AAA’ పేరుతో మల్టీప్లెక్స్‌ నిర్మాణం చేపట్టారు. ఈ మల్టీ ప్లెక్స్‌ నిర్మాణం దాదాపు పూర్తయింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీప్లెక్స్‌ను జూన్‌ 16న ప్రారంభించనున్నారి తెలుస్తోంది. అదే రోజు ఆదిపురుష్‌ చిత్రం విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ‘AAA’ సినిమాస్‌లో మొట్టమొదటి సినిమాగా ఆదిపురుష్ స్క్రీనింగ్ చేయాలని బన్నీ భావిస్తున్నట్లు సమాచారం. రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా కావడం, ప్రభాస్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే క్రమంల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మల్టీప్లెక్స్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక బన్నీ కెరీర్‌ విషయానికొస్తే ప్రస్తుతం ఈ ఐకాన్‌ స్టార్‌ పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పుష్ప తొలి పార్ట్‌ ఊహించని స్థాయిలో విజయం అందుకోవడంతో ఇప్పుడు అందరి దృష్ణి సీక్వెల్‌పై పడింది. దీంతో అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. దర్శకుడు సుకుమార్‌ సీక్వెల్ కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..