AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash: బాలీవుడ్ స్టార్ హీరోలకు దడ పుట్టిస్తోన్న కేజీఎఫ్ హీరో.. రాఖీ భాయ్ ముంబైని ఏలుతాడా.?

యశ్‌.. 2018 వరకు ఈ పేరు ఒక్క కన్నడ సీమకు తప్ప పెద్దగా ఎవరికీ పరియం లేని పేరు. కానీ కేజీఎఫ్‌ సినిమా విడుదల తర్వాత ఈ పేరు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా మారుమోగింది. రాఖీభాయ్‌ పాత్రతో యువతను విపరీతంగా ఆకట్టుకున్నాడు యశ్‌. అనంతరం కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా..

Yash: బాలీవుడ్ స్టార్ హీరోలకు దడ పుట్టిస్తోన్న కేజీఎఫ్ హీరో.. రాఖీ భాయ్ ముంబైని ఏలుతాడా.?
Yash Bollywood Offers
Narender Vaitla
|

Updated on: Oct 28, 2022 | 2:55 PM

Share

యశ్‌.. 2018 వరకు ఈ పేరు ఒక్క కన్నడ సీమకు తప్ప పెద్దగా ఎవరికీ పరియం లేని పేరు. కానీ కేజీఎఫ్‌ సినిమా విడుదల తర్వాత ఈ పేరు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా మారుమోగింది. రాఖీభాయ్‌ పాత్రతో యువతను విపరీతంగా ఆకట్టుకున్నాడు యశ్‌. అనంతరం కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్‌2 సినిమాతోనూ భారీ విజయాన్ని అందుకున్నాడు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించి దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడీ డైనమిక్‌ హీరో. కేవలం ఒక్క సినిమాతోనే పాన్‌ ఇండియా హీరోగా మారాడు. దీంతో యశ్‌ నటించే సినిమాలపై ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగిపోయాయి.

యశ్‌తో సినిమా చేయడానికి భాషలకు అతీతంగా దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు యశ్‌తో సినిమా చేయడానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్‌లో యశ్‌ను తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమాలో లీడ్‌ రోల్‌లో యశ్‌ను తీసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. మహాభారతం ఆధారంగా ‘కర్ణ’ అనే పౌరాణిక ఇతిహాసంలో యశ్‌ను తీసుకోనున్నారని టాక్‌. ఇక బ్రహ్మాస్త్ర సీక్వెల్‌లో దేవ్‌ పాత్రలో యశ్‌ను తీసుకోవాలని నిర్మాత కరణ్‌ జోహార్‌ ఆలోచిస్తున్న సమాచారం.

ఇందులో భాగంగానే కరణ్‌ ఇప్పటికే యశ్‌ను కలిసినట్లు కూడా సమాచారం. దీనికి యశ్‌కు కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే యశ్‌ ఈ రెండు సినిమాలకు ఓకే చెప్తాడా.? లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే జనవరి 8వ తేదీన యశ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన బాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించి ఏదైనా అప్‌డేట్‌ వస్తుందనే చర్చ సాగుతోంది. మరి యశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. మరి కన్నడ సినిమా స్థాయిని దేశానికి చాటిచెప్పిన యశ్‌.. బాలీవుడ్‌లో ఏమేర రాణిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..