AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh-Rajamouli: మల్టీ స్టారర్‌గా రాజమౌళి-మహేష్‌ల చిత్రం.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్త..

Mahesh-Rajamouli: బాహుబలితో ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని పెంచేశారు దర్శకుడు రాజమౌళి. దీంతో ఈ సినిమా తర్వాత పెద్ద హీరో సినిమా ఏది వచ్చినా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నాయి. తెలుగు కథలకు...

Mahesh-Rajamouli: మల్టీ స్టారర్‌గా రాజమౌళి-మహేష్‌ల చిత్రం.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్త..
Narender Vaitla
|

Updated on: Feb 04, 2022 | 8:39 PM

Share

Mahesh-Rajamouli: బాహుబలితో ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని పెంచేశారు దర్శకుడు రాజమౌళి. దీంతో ఈ సినిమా తర్వాత పెద్ద హీరో సినిమా ఏది వచ్చినా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నాయి. తెలుగు కథలకు ఇతర భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ వస్తుండడంతో నిర్మాతలు సైతం ఇతర భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అన్ని భాషలకు చెందిన నటీనటులు ఉండేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కారణం చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తుండడమే.

ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత జక్కన్న ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా స్థాయిలోనే విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు ఇతర భాషల్లోనూ క్రేజ్‌ తెప్పించడానికి జక్కన్న ఒక ప్లాన్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మల్టీ స్టారర్‌గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే తెలుగు హీరో కాకుండా తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోను జక్కన్న ఇందుకోసం రంగంలోకి దింపనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇక రాజమౌళితో సినిమాకోసం మహేష్‌ ఫ్యాన్స్‌ సైతం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్‌ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు విజేయంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీపై ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.

Also Read: Anantapur: బాలకృష్ణ రాజీనామాను ప్రజలు కోరుకుంటున్నారు అంటున్న మంత్రి శంకర్ నారాయణ

UP Assembly Election 2022: యూపీ సీఎం వద్ద గన్స్.. అఫిడవిట్‌లో ప్రకటించిన యోగి ఆదిత్యనాథ్..

యంగ్‌గా ఉండాలనుకుంటున్నారా.? ఈ ఫుడ్‌ తీసుకోండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..