AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur: బాలకృష్ణ రాజీనామాను ప్రజలు కోరుకుంటున్నారు అంటున్న మంత్రి శంకర్ నారాయణ

Anantapur: ఏపీ(Andhrapradesh)లో కొత్త జిల్లా ఏర్పాటు(AP New Districts) వివాదం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రం ఏర్పాటు, జిల్లా పేర్లు విషయంలో పలు డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. జిల్లా కేంద్రం..

Anantapur: బాలకృష్ణ రాజీనామాను ప్రజలు కోరుకుంటున్నారు అంటున్న మంత్రి శంకర్ నారాయణ
Minister Shankar Narayana Vs Mla Balakrishna
Surya Kala
|

Updated on: Feb 04, 2022 | 7:28 PM

Share

Anantapur: ఏపీ(Andhrapradesh)లో కొత్త జిల్లా ఏర్పాటు(AP New Districts) వివాదం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రం ఏర్పాటు, జిల్లా పేర్లు విషయంలో పలు డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. జిల్లా కేంద్రం ఏర్పాటు పై హిందూపురం వాసులు మండి పడుతున్నారు. గత కొన్ని రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు జిల్లా కేంద్రంగా హిండుపురాన్ని ప్రకటించాలంటూ… ఎమ్మెల్యే బాలకృష్ణ మౌన దీక్ష చేశారు. ఈ నేపధ్యంలో బాలకృష్ణ మౌనదీక్ష పై మంత్రి శంకర్ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఏడు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి హిందూపూర్ అభివృద్ధికి కృషి చెయ్యని బాలకృష్ణ రాజీనామా చేయాలని ప్రజలే కోరుకుంటున్నారని తెలిపారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ జిల్లా కైనా ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ఆలోచన ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. కేవలం సినిమా షూటింగ్ లేనప్పుడు మాత్రమే బాలకృష్ణకు హిందూపురం ప్రజలు గుర్తుకు వస్తారంటూ ఎద్దేవా చేశారు. పెనుకొండ జిల్లా కేంద్రం కావాలని మాకు కూడా కోరిక ఉంది.. అయితే ఆధ్యాత్మిక పట్టణమైన పుట్టపర్తి జిల్లా కేంద్రం ప్రకటించడం అందరికీ ఆనందదాయకమని మంత్రి శంకర్ నారాయణ చెప్పారు. ఇక మరో వైపు బాలకృష్ణ మౌన దీక్షపై ఎమ్మెల్సీ ఇక్బాల్ స్పందించారు. ప్రజలకు ఎమ్మెల్యే బాలకృష్ణ అందుబాటులో ఉంటానని ఎన్నికల సమయంలో బాలకృష్ణ చెప్పారు.. మరి ఆ హామీ ఏమైంది అంటూ ప[ప్రశ్నించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని మేము కూడా కోరాం… ఇప్పటికే కలెక్టర్ దృష్టి మా అభ్యంతరాలను తీసుకెళ్మళామని చెప్పారు.

సత్యసాయి సేవలను గుర్తించి పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం భావించి ఉండవచ్చు.. రాజకీయ లబ్ధి కోసమే జిల్లా కేంద్రం చేయాలని టిడిపి వాళ్లు డ్రామా చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు ఇక్బాల్. అంతేకాదు అసలు టిడిపీ నాయకులు రాయలసీమ ద్రోహులన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ ఒక్కసారి అయిన మాట్లాడారా.. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయడం టిడీపీ నేతలకు ఇష్టామా …! కాదా.. తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. బాలయ్య అఖండ కాదు … జిల్లాకు గుడిబండగా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read:

తుది పోరుకు సిద్ధమైన భారత అండర్-19 జట్టు.. ఐదోసారి టైటిల్ గెలిచేనా..