Dhanush Sir Movie: ధనుష్ సినిమా నుంచి సంయుక్త తప్పుకుందా..? ఈ వార్తలో నిజమెంత..
Dhanush Sir Movie: ధనుస్ హీరోగా తెలుగులో తెరకెక్కుతోన్న సినిమా సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో లాంచనంగా ప్రారంభించారు...
Dhanush Sir Movie: ధనుస్ హీరోగా తెలుగులో తెరకెక్కుతోన్న సినిమా సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో లాంచనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ కొట్టగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఇక ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలో ఏక కాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్‌కు జోడిగా కోలీవుడ్ బ్యూటీ సయుక్త మీనన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సంయుక్త ఇప్పటికే భీమ్లా నాయక్ చిత్రంలో రానాకు జోడిగా నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ లెక్కన సయుక్తకు ఇది రెండో తెలుగు చిత్రంగా చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే తాజాగా జరుగుతోన్న చర్చ ప్రకారం సార్ చిత్రం నుంచి సంయుక్త తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తప్పుకుంది అనేకంటే తప్పించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంతేకాకుండా సంయుక్త తన సోషల్ మీడియాలో హ్యాండిల్స్‌లో కూడా సార్ చిత్రానికి సంబంధిన అప్‌ఢేట్స్‌ను డిలీట్ చేయలేదు. దీంతో ఇది కేవలం పుకారు మాత్రమేననే వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ సంయుక్త సార్‌లో నటిస్తుందా.. లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: బంధువే కదా అని పెళ్లికి ఆహ్వానిస్తే.. ఇల్లంతా గుల్ల చేశాడు..! అసలు విషయం తెలిస్తే షాకవుతారు..
Viral Video: వెంటాడి వేటాడింది.. ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు..
Gadget Guru video: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? అయితే ఇది తప్పనిసరిగా తెలుసుకోండి..(వీడియో)