బంధువే కదా అని పెళ్లికి ఆహ్వానిస్తే.. ఇల్లంతా గుల్ల చేశాడు..! అసలు విషయం తెలిస్తే షాకవుతారు..

Visakhapatnam Crime News: పెళ్లికి పిలుపువస్తే చాలు.. వాడికి పండగే..పండగ..! మనవాడే కదా అని మాటకలిపితే.. మాయచేసేస్తాడు. బంధువేకదా అని

బంధువే కదా అని పెళ్లికి ఆహ్వానిస్తే.. ఇల్లంతా గుల్ల చేశాడు..! అసలు విషయం తెలిస్తే షాకవుతారు..
Crime News

Visakhapatnam Crime News: పెళ్లికి పిలుపువస్తే చాలు.. వాడికి పండగే..పండగ..! మనవాడే కదా అని మాటకలిపితే.. మాయచేసేస్తాడు. బంధువేకదా అని పెళ్లికి ఆహ్వానం ఇస్తే అతను చేసిందేమిటో తెలుసా..? ఇంట్లో వారంతా రెసెప్షన్ హడావిడిలో మండపంలో ఉంటే.. అతను మాత్రం ఆ ఇంట్లోకి చొరబడి అంతా చక్కబెట్టేశాడు. అయితే.. పరాయి వారి ఇళ్లను అస్సలు టచ్ చేయడు. ఇలా ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. సాధారణంగా దొంగలంటే ముఖపరిచయం లేని వారుంటారు. మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లోని ఇళ్లను టార్గెట్ చేసుకుని చెలరేగిపోతుంటారు. వాస్తవానికి ప్రొఫెషనల్ దొంగలు (Thief) చాలామంది చోరీలు ఇలాగే చేస్తుంటారు. కానీ.. విశాఖపట్నం (Visakhapatnam ) లో మాత్రం ఓ దొంగ తమవారినే టార్గెట్ చేస్తాడు. అదీకూడా తమ సామాజిక వర్గానికి చెందిన ఇళ్లనే ఎంచుకుని గుల్ల చేసేస్తున్నాడు.

ఈ దొంగ పేరు షేక్ షాహిద్. వయసు 32. వృత్తి ఆటోడ్రైవర్. ప్రవృత్తి.. తెలిసిన వారిళ్ళలో దొంగతనాలు..! విశాఖ (Vizag City) రైల్వే న్యూకాలనీలో నివాసముంటున్న షేక్ షాహిద్.. ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఏమైందో ఏమోకాని చోరీలకు కూడా అలవాటుపడ్డాడు. బయటివారిళ్లు వద్దనుకున్నాడో ఏమోగానీ.. తెలిసిన వారిఇళ్లలోనే చోరీలకు పాల్పడుతున్నాడు. పక్కా రెక్కీ చేసుకుని పనికానిచ్చేస్తున్నాడు. ఉన్నదంతా మూటగట్టుకుని మూడోకంటికి తెలియకుండా చెక్కేస్తున్నాడు.

గతనెలలో పెందుర్తిలోని మున్షీ లియాకత్ అనే ఇంట్లో వివాహం జరిగింది. తనకొడుకు వివాహానికి సంబంధించి పిలుపు అందుకున్నాడు షేక్ షాహిద్. ఇక అంతే..! పెళ్ళి కార్డు అంతా చదివి అందులో రెసెప్షన్ ఎప్పుడని తెలుసుకున్నాడు. వెన్యూ కూడా తెలుసుకుని ఓ స్కెచ్ వేశాడు. రెసెప్షన్ జరిగిన రోజు అందరి లాగే ఇంటినుంచి బయలుదేరాడు షాహిద్. బయలుదేరింది రెసెప్షన్ కోసమే అయినా.. వెళ్ళింది అక్కడకు కాదు. ఎందుకుంటే.. రెసెప్షన్ జరిగేది కల్యాణ మండపంలో..! షాహిద్ వెళ్ళింది పెళ్ళికొడుకు ఇంటికి. అదేంటీ.. అంతా కల్యాణమండపంలో ఉంటే ఇంటికి వెళ్ళి ఏంచేస్తాడనే అనుకుంటే పొరపాటే..! తన స్కెచ్ కూడా అదే. అంతా రెసెప్షన్ హడావుడిలో కల్యాణ మండపంలో ఉంటే.. ఎంచక్కా వారి ఇంటికి వెల్లిన షాహిద్.. ఇంట్లో ఉన్న నగలు, నగదు మూటగట్టుకున్నాడు. హ్యాపీగా ఇంటికి వెళ్లిపోయాడు.

రెసెప్షన్ అయిన తరువాత ఇంటికి వెళ్లిన ఆ పెళ్లికొడుకు తండ్రి.. ఇంట్లో ఉన్న నగలు, నగదు మాయమవడాన్ని గుర్తించారు. అప్పటివరకు వివాహ ఉత్సాహంలో ఉన్న ఆ కుటుంబమంతా.. ఒక్కసారిగా ఆందోళనలో పడింది. దీంతో.. పోలీసులను ఆశ్రయించాడు పెళ్ళికొడుకు తండ్రి. కేసు నమోదు చేసిన క్రైమ్ పోలీసులు.. కూపీ లాగారు. పాతనేరస్థులపై ఆరా తీశారు. తొలుత ఎక్కడా క్లూ లభించలేదు. చివరకు ఆధారాలను సేకరించిన తరువాత బంధువుల కోణంలో పోలీసులు వివరాలు సేకరించారు. దీంతో.. షేక్ షాహిద్ లింక్ కుదిరింది. పట్టుకుని విచారించే సరికి.. అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు షేక్ షాహిద్. తాను వివాహవేడుక పిలుపు అందుకుని ఇంటిని గుల్లచేసే విధానాన్ని వివరించాడు. ఇది విన్న పోలీసులు.. అవాక్కయ్యారు.

అంతేకాదు.. పట్టుకుని పోలీస్ స్టైల్లో విచారించే సరికి.. మరో అయిదు నేరాలనూ సైతం ఒప్పుకున్నాడు షేక్ షాహిద్. ఫోర్త్ టౌన్ లిమిట్స్‌లో నాలుగు నేరాలను చేసినట్టు వివరించాడు. . అదీకూడా తన ఇంటి పక్కనే…! తెలిసిన వారి ఇళ్లనే టార్గెట్ చేశాడు. అందరూ కూడా తన సామాజిక వర్గానికి చెందిన ఇళ్ళలోనే చోరీలు చేసినట్టు ఒప్పుకున్నాడు షాహిద్. ఎందుకంటే ఎవరికీ అనుమానం రాదని ఈ పనిచేస్తున్నాడట..! వీటితో పాటు కంచరపాలెంలో ఓ గ్రామీణ వికాస్ బ్యాంకునూ చోరీకి యత్నించి విఫలమయ్యాడు షేక్ షాహిద్. ఇలా.. ఆరు కేసుల్లో 17 తులాల బంగారం, 30 తులాల వెండి, 3.80 లక్షల నగదు లాగేశాడు.

ఎట్టకేలకు ఈ వెరైటీ దొంగ చిక్కడంతో.. అతని నుంచి పదిహేనున్నర తులాల బంగారం, 30 తులాల వెండితో పాటు.. 2.45 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు చోరీలకు వినియోగించే బైక్‌ను కూా స్వాధీనం చేసుకున్నట్లు సిసిఎస్ ఏసీపీ శ్రవణ్ కుమార్ తెలిపారు. షేక్ షాహిద్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కునెట్టారు.

పెళ్ళి పిలుపును అందుకుని వారిఇంటినే గుల్ల చేసిన వెరైటీ దొంగ వింతచేష్టలు తెలుసుకుని పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. ఈ ఆరు కేసులతో పాటు.. గతంలోనూ షాహిద్ పై ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసునమోదైంది. ఇదే పెందుర్తి చోరీ కేసులో పోలీసులకు కలిసొచ్చిందని పేర్కొంటున్నారు.

ఖాజా, టీవీ9 తెలుగు రిపోర్టర్, వైజాగ్

Also Read:

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య.. కత్తితో

Warangal: మద్యం షాప్ దగ్గర ఆగి ఉన్న ఇన్నోవా కారు.. అనుమానంతో డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!

Published On - 9:18 pm, Tue, 11 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu