AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన బాలయ్యలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్

మలేషియాలోని ఈ వ్యక్తి అచ్చు గుద్దినట్లు సేమ్ టు సేమ్ నందమూరి బాలయ్య బాబులాగే కనిపిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఇతనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. అయితే ఇది ఫేక్ వీడియో అని బాలయ్య అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Balakrishna: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన బాలయ్యలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్
Balakrishna Doppelganger
Basha Shek
|

Updated on: Apr 07, 2026 | 9:52 PM

Share

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనేది నానుడి. ఏడుగురు కాకపోయినా కనీసం ఒకరు, ఇద్దరు ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులు మనకు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. ఎలాంటి బంధుత్వం లేకున్నా ఒకే పోలికలతో కనిపించే వ్యక్తులనుఇంగ్లిష్ లో డొపెల్ గ్యాంగర్స్ లేదా ట్విన్ స్ట్రేంజర్స్ అని పిలుస్తుంటారు. సామాన్యుల కంటే సెలబ్రిటీల విషయంలో ఇలాంటి మనుషులు మనకు ఎక్కువగా తారసపడుతుంటారు. గతంలో ఐశ్వర్యారాయ, అనుష్కా శర్మ, సమంత, మహేష్ బాబులను పోలిన వ్యక్తులు సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యారు. ఇప్పుడు నందమూరి హీరో బాలయ్య బాబును పోలిన ఓ వ్యక్తి నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. మలేషియాలో జరిగిన ఒక హిందూ జాతరకు ఓ తెలుగు యూట్యూబర్ వెళ్లాడు. అక్కడ రద్దీగా ఉండే ఓ షాపు దగ్గరకు వెళ్లిన అతను ఓ వ్యక్తిని చూసి ఆశ్చర్యంతో ఆగిపోయాడు. ఎందుకంటే ఆ షాపులో పానీపూరీ అమ్ముతున్న వ్యక్తి అచ్చుగుద్దినట్లు నందమూరి నటసింహం బాలకృష్ణ లాగే కనిపిస్తున్నాడు. దీంతో సదరు యూట్యూబర్ వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కాస్త క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. దీనిని చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. అరె. ఎవరీ మనిషి.. అచ్చం మన బాలయ్య బాబులానే ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు నందమూరి అభిమానులు మాత్రం ఈ వీడియోపై మండిపడుతున్నారు. అసలు ఆ వ్యక్తికి, బాలయ్యకు పోలికే లేదు.. వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా అఖండ 2 తాండవం సినిమాలో చివరిగా కనిపించారు బాలయ్య. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన వీర సింహారెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us