AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: మృణాల్‌ రూట్లో జాన్వీ.. ఐడియా క్లిక్‌ అవుతుందా ??

Janhvi Kapoor: మృణాల్‌ రూట్లో జాన్వీ.. ఐడియా క్లిక్‌ అవుతుందా ??

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 8:02 PM

Share

మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్లు వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సైలెంట్‌గా ఉంటే గుర్తింపు ఉండదని అర్థం చేసుకున్న వీరు, పబ్లిసిటీ కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మృణాల్ ప్రేమ గురించి, జాన్వీ తన చిన్ననాటి ఘటన గురించి మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ట్రెండ్ ద్వారా సెలబ్రిటీలు నిరంతరం ప్రజల్లో ఉండాలని చూస్తున్నారు.

ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో ఉండే హీరోయిన్లు కొంతమంది ఉంటారు. ఈ మధ్య ఈ లిస్టులో ప్రముఖంగా కనిపించిన పేరు మృణాల్‌ ఠాకూర్‌. నేనేం చేయకుండానే నాకు కోట్ల రూపాయల పబ్లిసిటీ వచ్చేసిందన్నారు మృణాల్‌. లేటెస్ట్ గా జాన్వీ కూడా మృణాల్‌ని ఫాలో అవుతున్నారా? ఊరుకుంటే ఊరూ పేరూ లేదనే విషయాన్ని అర్థం చేసుకున్నారా? చప్పుడు చేయడానికి సై అంటున్నారా? లెట్స్ హావ్‌ ఎ లుక్‌ ఆన్‌ ఇట్‌. మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆమె నటించిన డెకాయిట్‌ తెలుగులో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆ మధ్య ధనుష్‌ తో పెళ్లి అంటూ వార్తల్లో నిలిచారు ఈ బ్యూటీ. అలాంటిదేమీ లేదంటూ అప్పట్లో క్లారిటీ ఇచ్చిన ఈ లేడీ.. ఇప్పుడు మళ్లీ అలాంటి టాపిక్‌ మీదే స్పందించారు. త్వరలోనే తన జీవితంలోకి ప్రేమను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆ విషయాలను తానే స్వయంగా వెల్లడిస్తానన్నారు. దమృణాల్‌ నిత్యం వార్తల్లో ఉన్నట్టే.. తాను కూడా ఉండదలచుకున్నట్టున్నారు జాన్వీ కపూర్‌. సైలెంట్‌గా పని చేసుకుని పోతుంటే ఎవరూ పట్టించుకోరనే విషయాన్ని అర్థం చేసుకున్నట్టున్నారు. తన చిన్నతనంలో జరిగిన సెన్సిటివ్‌ విషయాన్ని గురించి ఓపెన్‌ అయ్యారు. ఓ అశ్లీల సైట్‌లో తన ఫొటో ఉండటాన్ని 15 ఏళ్లప్పుడు తెలుసుకున్నానన్నారు. ఇలాంటి పనులు చేసేవారిని తలచుకుంటే బాధగా ఉంటుందన్నారు. వారందరూ మానసికంగా ఇబ్బంది పడుతున్నవారేనన్నారు జాన్వీ. మద్యం సేవించే వారిని కూడా మానసిక రుగ్మత ఉన్నవారిగానే గుర్తించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. దేవరతో తెలుగు తెరకు పరిచయమైన ఈ లేడీ ప్రస్తుతం పెద్దిలో నటిస్తున్నారు. నార్త్ లోనూ మంచి సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట

Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక

Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది

Follow Us