Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది
హైపర్ ఆదికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆది స్టేజ్ దిగి వచ్చి ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. హైపర్ ఆది సాధారణంగా వివాదాల జోలికి వెళ్లడు కాబట్టి, అతని కోపానికి కారణం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వ్యక్తి ఆదిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వీడియో పాతదా, కొత్తదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజాగా ఆదికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో హైపర్ ఆది ఓ వ్యక్తితో గొడవపెట్టుకుంటూ కనిపించాడు. స్టేజ్ దిగి వచ్చి మరీ అతనితో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. స్టేజ్ దిగి వచ్చి మరీ ఆది అతనికి వార్నింగ్ ఇస్తున్నాడంటే.. అక్కడ ఎదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. మాములుగా హైపర్ ఆది చాలా సహనంతో ఉంటాడు. వివాదాల జోలికి పెద్దగా వెళ్ళడు. అలాంటిది ఆది ఉన్నట్టుండి ఆడియన్స్‌లో ఉన్న ఓ వ్యక్తిపై సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లాడంటే.. అతను ఆదిని రెచ్చగొట్టేలా ఏదో కామెంట్ చేసిన ఉంటాడనే అందరూ అనుకుంటున్నారు. ఆది వార్నింగ్ ఇస్తుంటే చాలా మంది అతని చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉన్నారు. పక్కనే పోలీసుకు కూడా కనిపిస్తున్నారు. దాంతో అసలు ఏం జరిగింది.? ఆదికి అంత కోపం ఎందుకు వచ్చింది అంటూ మరికొంత మంది నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే ఈ వీడియో కొత్తదా.? లేక ఎప్పుడో జరిగిందా.. అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bombai Ki Ranu: ‘బొంబాయికి రాను’ యూట్యూబ్‌లో అరుదైర రికార్డ్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

