Bombai Ki Ranu: ‘బొంబాయికి రాను’ యూట్యూబ్‌లో అరుదైన రికార్డ్
తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఏలుతున్నాయి. బిగ్ బాస్ రామూ రాథోడ్ పాడిన 'రానూ బొంబాయికి రానూ' పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. 800 మిలియన్ల వ్యూస్‌తో తెలుగులో అత్యధిక వీక్షణలు పొందిన జానపద పాటగా చరిత్ర సృష్టించింది. ఈ పాట తెలంగాణ గ్రామీణ నేపథ్యం, ఆకట్టుకునే సాహిత్యం, ట్యూన్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.
గత కొన్నేళ్లుగా ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి. అందులోనూ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు అయితే సినిమా పాటలకు మించిన వ్యూస్ వస్తున్నాయి. పెళ్లిళ్లు, పండగలు, జాతరలు, స్కూల్ ఫంక్షన్లు, ఈవెంట్లు.. ఎక్కడ చూసినా మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ వినపడాల్సిందే.. మాస్ స్టెప్పులు పడాల్సిందే. ఈ నేపథ్యంలో ఒక తెలంగాణ ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 800 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తెలుగు జానపద పాటగా రికార్డు సొంతం చేసుకుంది. బిగ్ బాస్ ఫేమ్ రామూ రాథోడ్ స్వయంగా రాసి ఆలపించిన ‘రానూ బొంబాయికి రానూ’ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. గత కొన్నినెలలుగా ఈ ఫోక్ సాంగ్ సోషల్ మీడియాను వూపేస్తోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా లిరిక్స్, ఆకట్టుకునే ట్యూన్ ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే చిన్న పిల్లల నుంచి ముసలి వయసు వారు కూడా ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. రిపీటెడ్ గా వింటూ.. రీల్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో అత్యధిక వ్యూస్ వచ్చిన తెలుగు పాట అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్ పేరిట ఉంది. అయితే తెలుగు జానపదా పాట విషయానికి వస్తే.. 80 కోట్ల వ్యూస్ తో ‘రానూ బొంబాయికి రానూ’ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాటకు రాము రాథోడే స్వయంగా లిరిక్స్ రాసి ఆలపించాడు. అలాగే కళ్యాణ్ కీస్ సంగీతం అందించాడు. శేఖర్ వైరస్ మాస్టర్ రూపొందించిన స్టెప్పులు పాటకు మరింత జోష్ తీసుకొచ్చాయి. వేములవాడ ప్రాంతంలో ప్రధానంగా ఈ సాంగ్ షూటింగ్ చేశారు. క్లైమాక్స్ సీన్స్ కోసం జగిత్యాలలో చిత్రీకరణ జరిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

