అన్నమయ్య జిల్లాలోని బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తిని భార్య రఫాతి మరో ముగ్గురితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన జరిగినప్పుడు వారి ఐదేళ్ల కుమారుడు అక్కడే ఉన్నాడు. నిందితులు పరారవగా, చిన్నారి తండ్రి నిద్రపోతున్నాడని భావించి రాత్రంతా మృతదేహం పక్కనే గడిపాడు. తెల్లవారుజామున ఏడుస్తుండటంతో ఈ దారుణం వెలుగుచూసింది.