AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: మరింత బోల్డ్ గా మారనున్న శ్రీలీల

Sreeleela: మరింత బోల్డ్ గా మారనున్న శ్రీలీల

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 8:59 PM

Share

శ్రీలీల కెరీర్, జీవితంపై తనదైన శైలిలో మాట్లాడారు. 'నా చేతలే మాట్లాడాలి' అన్న ఆమె, పాత్రల ఎంపికలో మరింత బోల్డ్ గా ఉంటానన్నారు. నటన, మెడికల్ వృత్తులను బ్యాలెన్స్ చేస్తూ, ఒత్తిడిని డిటాచ్‌మెంట్ ద్వారా అధిగమిస్తున్నానని తెలిపారు. ఏ రంగంలోనైనా అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్‌ అలవాటు చేసుకున్నవారే సంతోషంగా ఉంటారని శ్రీలీల నమ్మకం.

అటాచ్‌మెంట్‌, డిటాచ్‌మెంట్‌ గురించి ఎవరేం చెప్పినా ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది. అలాంటిది అందాల భామ శ్రీలీల చెబితే వినకుండా ఉంటామా? ష్యూర్‌గా విని తీరాల్సిందే. టాలీవుడ్‌కి కాసింత దూరంగా, బాలీవుడ్‌కి మరింత దగ్గరగా మెలుగుతున్న ఈ లేడీ ఇప్పుడు ఏం స్టేట్‌మెంట్‌ ఇచ్చారు? రాబోయే రెండేళ్లలో నేను కాదు, నా చేతలే మాట్లాడాలని కోరుకుంటున్నానని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు శ్రీలీల. పాత్రల ఎంపిక విషయంలో గతంతో పోలిస్తే మరింత బోల్డ్ గా ఉండాలన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట. కంఫర్ట్ జోన్‌ నుంచి ఆలోచించడానికి కావాల్సిన అన్ని ట్రయల్స్ వేస్తున్నానంటున్నారు మిస్‌ లీల. ఎక్కడ కనిపించినా తన అప్పియరెన్స్ తో మెస్మరైజ్‌ చేసే శ్రీలీల.. తనకు ఫ్యాషన్‌ వరల్డ్ ఇప్పుడిప్పుడే పరిచయమవుతోందంటున్నారు. మనకు కంఫర్ట్ అనిపించే కాస్ట్యూమ్ నే తాను ఇప్పటిదాకా ఫ్యాషన్‌ అని అనుకుంటున్నట్టు వెల్లడించారు. సినిమా కెరీర్‌ని, మెడికల్‌ ప్రొఫెషన్‌ని సైమల్‌టైనియస్‌గా హ్యాండిల్‌ చేయడం నేర్చుకుంటున్నానంటున్నారు శ్రీలీల. రెండు ఫీల్డులూ జనాలకు దగ్గరైనవేనని, దేని ప్రత్యేకత దానిదేనని చెప్పారు శ్రీలీల. చేస్తున్న పని ఏదైనా రెట్టింపు బాధ్యతతో చేయడానికే ఇష్టపడతానంటున్నారు ఈ లేడీ. ప్రతి నిత్యం స్ట్రెస్‌ ఉంటుందిగా.. దాన్ని ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే, మ్యూజిక్‌ వింటానని, ఫ్యామిలీతో మాట్లాడుతానని, చేస్తున్న పని నుంచి తనను తాను డిటాచ్‌ చేసుకోవడం తెలుసని చెబుతున్నారు శ్రీలీల. ఏ రంగంలోనైనా…. అటాచ్‌మెంట్‌ ఎలా పెంచుకుంటారో, డిటాచ్‌మెంట్‌ కూడా అలాగే అలవాటు చేసుకున్నవాళ్లు హ్యాపీగా ఉంటారన్నది శ్రీలీల నమ్మే విషయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Liquor: మందుబాబులకు షాక్.. పెరగనున్న మద్యం ధరలు

తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట

Follow Us