తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
శ్రీ సత్యసాయి జిల్లాలో నకిలీ ఏసీబీ అధికారి మోసం బయటపడింది. తహసీల్దార్ అన్వర్ హుస్సేన్‌ను బెదిరించి రూ. 50 లక్షలు వసూలు చేశాడు ఓ కేటుగాడు. అవినీతి చిట్టా ఉందంటూ మూడేళ్లుగా టోకరా వేసిన ఈ మోసం, నిజమైన ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడి హనుమంతును అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేశారు.
అవినీతి అధికారుల భయమే పెట్టుబడిగా ఓ కేటుగాడు ఏకంగా తహసిల్దార్‌నే బురిడీ కొట్టించి రూ. 50 లక్షలు వసూలు చేశాడు. తాను ఏసీబీ అధికారినని నమ్మించి మూడేళ్లపాటు సాగించిన ఈ మోసం, అసలు అధికారులు రంగంలోకి దిగడంతో బట్టబయలైంది. శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ తహసీల్దార్ గా పనిచేస్తున్న అన్వర్ హుస్సేన్ కు 2021 సంవత్సరంలో ఫోన్ కాల్ వచ్చింది.అవతలి వ్యక్తి తనను తాను ఏసీబీ సీఐ హరినాథ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో..నీ అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉంది.. త్వరలోనే నీ ఇల్లు, ఆఫీసుపై దాడులు చేస్తాం అంటూ బెదిరించాడు. ఏసీబీ అనగానే భయపడిన ఆ తహసిల్దార్ దాడులు జరగకుండా ఉండేందుకు దఫదఫాలుగా సుమారు రూ. 50 లక్షలు ఆ నకిలీ అధికారికి ముట్టజెప్పాడు. కట్ చేస్తే.. ఒకరోజు నిజమైన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేయడంతో అన్వర్ హుస్సేన్ విస్తుపోయాడు. అప్పటివరకు తాను డబ్బులు ఇచ్చింది అసలు అధికారికి కాదని, ఒక 420 గాడికి అని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ పాత కేసుపై తాజాగా సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దృష్టి సారించడంతో విచారణ వేగవంతమైంది. కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి ఈ ఘరానా మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు. అవినీతి అధికారుల భయాన్ని క్యాష్ చేసుకుంటున్న నకిలీ అధికారుల మోసం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్ కాదు.. కొత్తగా ప్యాచప్..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్
Biker Collection: బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్
Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట
Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక
తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్ !!
ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి
క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి

