Liquor: మందుబాబులకు షాక్.. పెరగనున్న మద్యం ధరలు
తెలంగాణలో మే నెల నుండి మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల గాజు సీసాల కొరత, ఉత్పత్తి వ్యయాలు పెరగడమే ప్రధాన కారణం. తయారీదారులు 12-15% పెంపును కోరగా, ప్రభుత్వం ఒక జ్యుడీషియల్ కమిటీని నియమించింది. బీర్ల ధరలు కూడా పెరుగుతాయి. ఇది రాష్ట్ర ఖజానాకు ఆదాయం, బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదంపై ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలోని మద్యం ప్రియులకు త్వరలో ధరల షాక్ తగలనుంది. మే నెల నుంచి మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, స్థానిక ఉత్పత్తి సమస్యలు ఏకకాలంలో ముంచుకురావడంతో ధరల పెంపు అనివార్యమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేరుగా రాష్ట్రంలోని మద్యం పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల గాజు సీసాల తయారీ యూనిట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా అనేక ఉత్పత్తి కేంద్రాలు మూతపడటంతో ఖాళీ సీసాల ధరలు పెరిగి, తయారీ వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ అదనపు భారాన్ని భరించలేమని తయారీ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. తెలంగాణలో చివరిసారిగా 2023 మే నెలలో మద్యం ధరలను సవరించారు. సాధారణంగా ఏడాదికి ఒకసారి జరిగే ఈ సమీక్ష గడువు ముగియడంతో, కొత్త ధరల అమలుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. తయారీ సంస్థలు సుమారు 12 నుండి 15 శాతం వరకు ధరలను పెంచాలని ప్రతిపాదించాయి. దీనిపై సమగ్ర విశ్లేషణ చేసేందుకు ప్రభుత్వం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే మే నెలలో తుది నిర్ణయం వెలువడనుంది. ఈసారి ధరల పెంపును శాస్త్రీయంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. బాటిల్ పరిమాణం, బ్రాండ్ కేటగిరీ , ప్రస్తుత ధర శ్రేణులను బట్టి వేర్వేరు స్లాబ్‌లలో ధరలను సవరించే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవిలో అధిక డిమాండ్ ఉండే బీర్ల ధరలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చు. అల్యూమినియం క్యాన్ల ధరలు పెరగడం, సరఫరా తగ్గడం వల్ల బీర్ల ధరలు మరోసారి భారం కానున్నాయి. ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం రంగంలో ఈ పరిణామాలు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ధరలు పెరిగితే విక్రయాలు ప్రభావితం కావడమే కాకుండా, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి, ఎక్కడో జరుగుతున్న యుద్ధం.. రాష్ట్రంలోని మందుబాబుల జేబులకు చిల్లు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్ కాదు.. కొత్తగా ప్యాచప్..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్
Biker Collection: బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్
Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట
Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక
తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్ !!
ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి
క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి

