AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: విజయ్‌ ‘స్నేహితుడు’ సినిమాలో నటించిన ఈ ‘మిల్లీమీటర్’ గుర్తున్నాడా? ఇప్పుడు అతను తెలుగులో ఫేమస్ హీరో

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ త్రీ ఇడియట్స్ కు రీమేక్ గా స్నేహితుడు సినిమా తెరకెక్కింది. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దళపతి హీరోగా నటించాడు. ఇలియానా హీరోగా యాక్ట్ చేసింది. అలాగే జీవా, శ్రీకాంత్ (శ్రీరామ్) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Tollywood: విజయ్‌ 'స్నేహితుడు' సినిమాలో నటించిన ఈ 'మిల్లీమీటర్' గుర్తున్నాడా? ఇప్పుడు అతను తెలుగులో ఫేమస్ హీరో
Tollywood Actor
Basha Shek
|

Updated on: Apr 07, 2026 | 9:10 PM

Share

సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తన రొటీన్ కు భిన్నంగా తెరకెక్కించిన రీమేక్ చిత్రం స్నేహితుడు.బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ త్రీ ఇడియట్స్ కు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు శంకర్. 2012లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇది శంకర్ రేంజ్ కు తగిన సినిమా కాదన్న నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని సమస్యలను హైలెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దళపతి హీరోగా నటించాడు. అలాగే ఇలియానా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. వీరితో పాటు జీవా, శ్రీకాంత్ (శ్రీరామ్), సత్యరాజ్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అయితే ఇదే సినిమాలో బాగా హైలైట్ అయిన రోల్‌లో మిల్లీమీటర్ ఒకటి. ఈ పాత్రలో ఒక కుర్రాడు అద్బుతంగా నటించాడు. అటెండర్‌గా, ఆఫీస్ బాయ్‌గా కనిపించి ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇప్పుడు మిల్లి మీటర్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అని కొందరు ప్రయత్నించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మిల్లి మీటర్ కుర్రాడు ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అది కూడా ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే కనిపిస్తున్నాడు.

విజయ్ స్నేహితుడు సినిమాతోనే కెరీర్ ప్రారంభించిన ఈ నటుడి పేరు వికాస్ ముప్పాల. స్నేహితుడు సినిమా తర్వాత 8 తొట్టక్కల్, కళ్లచిరుప్పు, గ్యాంగ్ ఆఫ్ మద్రాస్ తదితర తమిళ సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇక విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు.ఇందులో విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకడిగా వికాస్ కనిపించాడు.

ఇవి కూడా చదవండి

డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో వికాస్ ముప్పాల..

View this post on Instagram

A post shared by Vikas Muppala (@vikastarrrr)

డియార్ కామ్రేడ్ సినిమా తర్వాత  ప్లాట్, పెదకాపు, పంచతంత్ర, గేదెల రాజు తదితర తెలుగు సినిమాల్లోనూ హీరోగా, సహాయక నటుడిగా మెరిశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం వికాస్ అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ రెండు భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు.

వికాస్ మరిన్ని ఫొటోలు, వీడియోలు..

View this post on Instagram

A post shared by Vikas Muppala (@vikastarrrr)

View this post on Instagram

A post shared by Vikas Muppala (@vikastarrrr)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!