West Bengal Election 2021: బెంగాల్‌లో కరోనా విజృంభణ.. సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో బెంగాల్ ముఖ్య మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో బెంగాల్ ముఖ్య మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇకపై ఆమె ప్రచారం చేయొద్దని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో ఇకపై ప్రచారం చేయరని స్పష్టంచేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ప్రచారం చివరి రోజు ఏప్రిల్ 26న కోల్‌కతా నగరంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఒక సాధారణ సమావేశాన్ని మాత్రమే నిర్వహిస్తారని ఓబ్రెయిన్ పేర్కొన్నారు. అయితే.. ఎన్నికలు జరిగే జిల్లాల్లో నిర్వహించే ప్రచార సభలను కూడా 30 నిమిషాలకే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా పశ్చిమ బెంగాల్ ప్రచారాన్ని విరమించుకుంటున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం వెల్లడించారు. కోవిడ్ దృష్ట్యా ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం మమతా ఈ నిర్ణయం తీసుకుంటూ ప్రకటించారు.
కాగా పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే ఐదు విడతల ఎన్నికలు ముగిశాయి. ఇంకా మూడు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మిగతా మూడు దశల్లో జరిగే ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సీఎం మమతా బెనర్జీ గురువారం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా మమతా సూచనను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ క్రమంలోనే ప్రచార సమయాన్ని ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ కుదిస్తూ ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. మిగిలిన మూడు విడతలను ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్ 29 న నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read: