Face Mask: మాస్కు పెట్టుకోలేద‌న్నందుకు వీరంగం సృష్టించిన జంట‌.. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు..

Not Wearing Face Mask: ప్రస్తుతం క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో దేశం మొత్తం అత‌లాకుతల‌మ‌వుతోంది. రోజురోజుకీ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు భ‌యాందోళ‌న‌ల‌ను...

Face Mask: మాస్కు పెట్టుకోలేద‌న్నందుకు వీరంగం సృష్టించిన జంట‌.. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు..
Fir On Couple
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 19, 2021 | 7:13 AM

Not Wearing Face Mask: ప్రస్తుతం క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో దేశం మొత్తం అత‌లాకుతల‌మ‌వుతోంది. రోజురోజుకీ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు భ‌యాందోళ‌న‌ల‌ను క‌లిగిస్తున్నాయి. మొద‌టి వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ప్ర‌స్తుతం వైర‌స్ గాలి ద్వారా వ్యాపిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇంట్లో ఉన్నా కూడా మాస్కులు ధ‌రించాల్సిందేన‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం ఇవేవి ప‌ట్టించుకోకుండా మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వ‌స్తుంది. తాజాగా ఢిల్లీలో ఓ జంట మాస్కు లేకుండా క‌నిపించ‌డ‌మే కాకుండా పోలీసుల‌పై వీరంగం చూపించింది. ద‌ర్య‌జంగ్ ప్రాంతంలో ఓ జంట కారులో వెళుతోంది. మాస్కు ధ‌రించ‌కుండా వెళుతోన్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. మాస్కు ఎందుకు ధ‌రించ‌లేదు అన్నందుకు ఆ జంట పోలీసుల‌పైకి మాట‌ల దాడికి దిగింది. ఇక స‌ద‌రు మ‌హిళ అయితే అక్కడ దృశ్యాల‌ను చూస్తోన్న సామాన్యుల‌పైకి చిర్రెత్తుకు పోయింది. దూషిస్తూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు రెచ్చిపోయింది. దీంతో పోలీసులు స‌ద‌రు జంట‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. చూశారుగా ఇప్ప‌టి వ‌ర‌కు మాస్కులు లేక‌పోతే కేవలం ఫైన్ మాత్ర‌మే ఉంది. భ‌విష్య‌త్తులో కేసులు కూడా న‌మోద‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కాబ‌ట్టి బీ కేర్ ఫుల్‌..

పోలీసుల‌తో వాగ్వాదానికి దిగిన జంట వీడియో..

Also Read: Corona Vaccine: వ్యాక్సినేష‌న్ చేయించుకున్నా మ‌ళ్లీ పాజిటివ్‌గా తేలిందా..? అయినా ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..

Corona: భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డి చేయాలంటే రెండు నెల‌ల‌పాటు వీటిని బంద్ పెట్టాల్సిందే.. కీలక విష‌యాలు తెలిపిన‌..

Sanjay Gaikwad: ‘కరోనావైరస్‌ దొరికితే.. ఆయన నోట్లో వేస్తా’.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..