అసోం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్బర్మన్ కన్నుమూత.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
అసోం మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత భూమిధర్బర్మన్(91) కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Bhumidhar Barman: అసోం మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత భూమిధర్బర్మన్(91) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొన్ని రోజులుగా గువాహటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
1931లో జన్మించిన బర్మన్.. 1967లో రాజకీయాల్లో ప్రవేశించారు. భూమిధర్ బర్మన్ మొత్తం ఏడుసార్లు అసోం శాసనసభకు ఎన్నికయ్యారు. బర్మన్… హితేశ్వర్ సైకియా, తరుణ్ గొగోయ్ ప్రభుత్వాలలో… ఆరోగ్యం, విద్య , రెవెన్యూ వంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అనంతరం 2001-2016 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతను మొట్టమొదట 1967 లో అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. రెండు సార్లు అసోం సీఎంగా కూడా బర్మన్ సేవలందించారు. 1996 ఏప్రిల్-22న లో అసోం సీఎంగా ఉన్న హితేశ్వర్ సైకియా అనారోగ్య కారణాలతో మరణించగా ఆయన స్థానంలో బర్మన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1996 ఏప్రిల్ 22 నుంచి అదే ఏడాది మే 14 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2010లో మరోసారి బర్మన్ సీఎం అయ్యారు. 2010లో అప్పటి సీఎం తరుణ్ గోగోయ్ హార్ట్ సర్జరీ కోసం ముంబై వెళ్లిన సమయంలో బర్మన్ తాత్కాలిక సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2015లో రాష్ట్ర మంత్రిగానూ బర్మన్ సేవలందించారు.
బర్మన్ బలమైన అట్టడుగు వర్గాల నేతగా ఎదిగారు. గతంలో ఉల్ఫా ఉగ్రవాద సంస్థలు మూడు సార్లు ఆయనపై దాడి చేశాయి. బర్మాన్ ఎన్ఆర్సీ పద్ధతుల రూపకల్పనలో క్యాబినెట్ ఉప కమిటీకి నాయకత్వం వహించాడు. మాజీ మిలిటెంట్ సంస్థ బోడో లిబరేషన్ టైగర్స్ తో శాంతి ఒప్పందంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. అస్సాం ప్రభుత్వం బర్మాన్‌కు గౌరవ చిహ్నంగా మూడు రోజులపాటు సంతాపాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా అధికారిక వినోదం కార్యక్రమాలను రద్దు చేసింది. బర్మన్ మృతదేహాన్ని పూర్తి రాష్ట్ర గౌరవ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది.
అస్సాం కాంగ్రెస్‌కు మార్గదర్శక కాంతిలాగా ఉన్న బర్మన్ మరణానికి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సంతాపం తెలిపారు. అస్సాం రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి బర్మన్ చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని అన్నారు.
Read Also… World COVID-19: కరోనా మృత్యుఘోష.. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన మరణాలు..