Minister Harak Singh: ఉత్తరాఖండ్ బీజేపీలో సమసిన వివాదం.. రాజీనామాపై వెనక్కు తగ్గిన మంత్రి హరక్ సింగ్ రావత్
ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి హరక్ సింగ్ రావత్ రాజీనామాపై వచ్చిన ఆరోపణలకు తెరపడింది. ప్రతి పరిస్థితిలోనూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అండగా ఉంటానని హరక్ సింగ్ రావత్ స్పష్టం ఛేశారు.

Uttarakhand Politics: ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి హరక్ సింగ్ రావత్ రాజీనామాపై వచ్చిన ఆరోపణలకు తెరపడింది. ప్రతి పరిస్థితిలోనూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అండగా ఉంటానని హరక్ సింగ్ రావత్ స్పష్టం ఛేశారు. రాజీనామా చేస్తున్నట్లు వస్తున్నవార్తలను ఖండించిన ఆయన.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావాలని ప్రార్థిస్తున్నట్లు రావత్ వీడియోలో తెలిపారు.
అంతకుముందు, హరక్ సింగ్ రావత్ శనివారం తన నివాసంలో ధామీతో ఆరు గంటలపాటు సమావేశమయ్యారు. రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేశారు. శుక్రవారం నాటి మంత్రివర్గ సమావేశానికి రావత్ ఆగ్రహంతో నిష్క్రమించారు. ఆ తర్వాత ఆయన రాజీనామాపై ఊహాగానాలు వచ్చాయి. తన నియోజకవర్గం కోట్‌ద్వార్‌లో వైద్య కళాశాల ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపకపోవడంతో కలత చెంది రావత్ సమావేశాన్ని వీడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రావత్‌ను రాజీనామా చేయకుండా ఒప్పించే బాధ్యతను బీజేపీ నేత, ఎమ్మెల్యే ఉమేష్ శర్మకు అప్పగించారు. మంత్రి ఫిర్యాదును పరిష్కరించామని, ఎవరూ వెళ్లడం లేదని ఆయన చెప్పారు.
పుష్కర్ నా సోదరులు, ప్రతి సందర్భంలోనూ నాతో పాటు ఉండేవాడు అని హరక్ సింగ్ రావత్ వీడియోలో చెప్పారు. నేను అతనిని అన్నయ్యగా ఆశీర్వదిస్తున్నాను. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంలోని ప్రజలకు, సుదూర కొండ ప్రాంతాలకు న్యాయమైన రీతిలో ధామీని నిజాయితీగా పనిచేస్తున్నారని తెలిపారు.
పేదలు, యువత, మహిళల పట్ల తన హృదయంలో సానుభూతి ఉన్న అలాంటి ముఖ్యమంత్రిని తొలిసారిగా రాష్ట్రానికి తన రూపంలో లభించిందని రావత్ అన్నారు. శనివారం రావత్‌ను కలవడానికి ముందు, మంత్రి ఫిర్యాదు కుటుంబ సంబంధమైనదని ధామి అన్నారు. ఇది త్వరలో పరిష్కరించకుంటామన్నారు. కోట్‌ద్వార్‌లో మెడికల్ కాలేజీ కోసం రావత్ ప్రతిపాదనను ధామి అంగీకరించారు. ప్రాజెక్ట్ కోసం మొదటి విడత రూ. 20 కోట్లను సోమవారం విడుదల చేయడానికి సైతం అంగీకరించారు.
Read Also… Rajnath Singh: శక్తివంతమైన బ్రహ్మోస్ చూస్తే శత్రు దేశాలు వణికిపోవాలిః రక్షణ మంత్రి రాజ్‌నాథ్