Priyanka Gandhi: యోగి పాలనలో గోమాతకు రక్షణ లేదు.. బండ జిల్లా గోవుల సమాధిపై ప్రియాంక గాంధీ ఫైర్
UP Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Priyanka Gandhi fire on CM Yogi: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా బందా జిల్లాలో గోవులను పాతిపెట్టారనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, యూపీ ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ.. మీ ప్రభుత్వంలో వందలాది ఆవులను సజీవ సమాధి చేశారని, గోమాత క్రూరత్వానికి గురైందని రాశారు.
యూపీ రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రియాంక చాలా దూకుడుగా పెంచారు. యోగి ప్రభుత్వాన్ని ప్రియాంక గాంధీ నిరంతరం టార్గెట్ చేస్తున్నారు. ఇదిలావుంటే, బండ జిల్లాలో కొద్దిరోజుల క్రితం గోవులను పాతిపెట్టే వ్యవహారం తెరపైకి రావడంతో ప్రియాంక గాంధీ యోగిసర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. బండ జిల్లాలో అనుమానాస్పదస్థితిలో చనిపోయిన గోవులను సమాధి చేవారు. దీతో ఆగ్రహించిన గ్రామస్థులు నరైని కూడలిని దిగ్బంధించి నిరసన తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్లపై తిరుగుతున్న ఆవులను మధ్యప్రదేశ్ సరిహద్దులోని అడవిలో వదిలివేయడమే కాకుండా, వాటిని మట్టిలో పూడ్చి, భారీ రాళ్లలో సజీవంగా పూడ్చిపెట్టారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక బిజెపి ఎమ్మెల్యే రాజ్ కరణ్ కబీర్ సంఘటనా స్థలానికి చేరుకుని చాలా ఆవులను మట్టిలో నుండి బయటకు తీశారు. రాళక్లు తొలగించబడ్డాయి. ఇందులో కొన్ని ఆవులు చనిపోయాయి.
ఇందుకు సంబంధించి విషయం తెలిసి ప్రజలు, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి రాళ్లు, మట్టిని తొలగించగా.. చాలా ఆవులు పాతిపెట్టి కనిపించాయి. ఈ గోవులను సజీవంగా మట్టిలో పాతిపెట్టారని, ఇది గోహత్య అని ఎమ్మెల్యే ఆరోపించారు. అదే సమయంలో ఆవుల గురించి ఎమ్మెల్యే రాజ్‌కరణ్ కబీర్ నరైని ఎస్‌డిఎం సూర్జిత్ సింగ్‌ను ఫోన్‌లో ప్రశ్నించగా.. వాటిని గోశాలకు పంపించామని చెప్పారు. అదే సమయంలో, అన్ని ఆవులను మూడు గోశాలలలో ఉంచామని, రాళ్లదాడి కింద ఏ ఆవు ఎమ్మెల్యే బయటకు తీశారో నాకు తెలియదని ఎస్‌డిఎం అన్నారు.
తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా రాష్ట్ర యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఎం యోగితో పాటు ప్రియాంక గాంధీ కూడా గోవుల మృతిపై ప్రధాని మోడీని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ, ఒక ట్వీట్ ద్వారా రాష్ట్ర యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, ” మైయోగియాదిత్యనాథ్ జీ, మీ ప్రభుత్వ పరిపాలన వందలాది ఆవులను బండలో పాతిపెట్టింది. మీ ప్రభుత్వంలో గోశాలలో గోవులు క్రూరత్వానికి, అమానవీయతకు బలి అవుతున్నాయి. నరేంద్రమోడీ జీ, ఈరోజు మీరు యూపీలో ఉన్నారు. గౌశల దుస్థితిపై మీరు యూపీ ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరతారా? అంటూ ట్వీట్ చేశారు.
..@myogiadityanath जी, आपकी सरकार के प्रशासन ने बांदा में सैकड़ों जिंदा गायों को दफना दिया। आपकी सरकार में गौशालाओं में गौ माता क्रूरता व अमानवीयता का शिकार हैं।@narendramodi जी आज आप उप्र में हैं। क्या आप गौशालाओं की दुर्दशा पर उप्र सरकार से जवाबदेही मांगेंगे? pic.twitter.com/hovmTpUWIl
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 13, 2021
Read Also… PM Narendra Modi: వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన.. కాళభైరవుడికి మోడీ హారతి, గంగా నదిలో పవిత్ర స్నానం