AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థార్ కారులో టిప్‌ టాప్‌గా బ్యూటిఫుల్ లేడీ పోలీస్.. అనుమానంతో ఆపి చెక్ చేయగా..

ఆమె అందంగా ఉంటుంది.. పైగా కానిస్టేబుల్.. నిత్యం రీల్స్ చేస్తూ ఇన్‌స్టా క్విన్‌గా మారిపోయింది.. ఆమెకు ఫ్యాన్స్‌.. ఫాలోయింగ్‌ ఎక్కువే.. తరచూ వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.. అయితే.. అంతా బాగానే ఉంది కానీ.. ఓ రోజు థార్‌ కారులో ప్రయాణిస్తోంది.. తన కారును ఎవరు ఆపుతారులే అనుకుంటూ రయ్యి రయ్యిన దూసుకొస్తోంది.. ఈ క్రమంలోనే..

థార్ కారులో టిప్‌ టాప్‌గా బ్యూటిఫుల్ లేడీ పోలీస్.. అనుమానంతో ఆపి చెక్ చేయగా..
Woman Constable Arrested
Shaik Madar Saheb
|

Updated on: Apr 04, 2025 | 5:40 PM

Share

ఆమె అందంగా ఉంటుంది.. పైగా కానిస్టేబుల్.. నిత్యం రీల్స్ చేస్తూ ఇన్‌స్టా క్విన్‌గా మారిపోయింది.. ఆమెకు ఫ్యాన్స్‌.. ఫాలోయింగ్‌ ఎక్కువే.. తరచూ వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.. అయితే.. అంతా బాగానే ఉంది కానీ.. ఓ రోజు థార్‌ కారులో ప్రయాణిస్తోంది.. తన కారును ఎవరు ఆపుతారులే అనుకుంటూ రయ్యి రయ్యిన దూసుకొస్తోంది.. ఈ క్రమంలోనే.. ఓ చెక్ పోస్టు దగ్గర పోలీసులు ఆమెను ఆపారు.. వాహనాన్ని చెక్ చేయాలంటూ చెప్పారు.. తాను కానిస్టేబుల్ ను అంటూ చెప్పింది.. అయినప్పటికీ.. అధికారులు వినకుండా.. ఆమె కారును చెక్ చేశారు.. దీంతో ఆమె కారులో.. డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపింది.. ఈ ఘటన పంజాబ్ లో కలకలం రేపింది. బటిండాకు చెందిన మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ వ్యక్తిగత వాహనాన్ని తనిఖీ చేయగా.. డ్రగ్స్‌తో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిందని.. దీంతో ఆమెను అరెస్ట్‌ చేసినట్లు పంజాబ్‌ పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను సర్వీస్‌ నుంచి డిస్మిస్ చేశారు.

పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. క్రమంలో లేడీ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ బుధవారం రాత్రి థార్‌ కారులో ప్రయాణిస్తుండంగా.. బటిండాలోని బాదల్ రోడ్ లోని ఫ్లైఓవర్‌ పై పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆమెను అడ్డగించారు.. అనంతరం లేడీ కానిస్టేబుల్ కారులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గేర్ బాక్స్ నుండి 17 గ్రాములకు పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె మాన్సాలో పోస్టింగ్ పొందగా.. ఇటీవలే బతిండా పోలీస్ లైన్స్ కు బదిలీ అయ్యిందని పోలీసులు తెలిపారు.. డ్రగ్స్‌ పట్టుబడిన అనంతరం పోలీసులు కౌర్‌ను అరెస్టు చేశారు. ఒక రోజు రిమాండ్‌లోకి తీసుకుని విచారించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం పోలీసులు అమన్‌దీప్‌ను ఉద్యోగం నుంచి తొలిగించినట్లు అధికారులు తెలిపారు.

View this post on Instagram

A post shared by Amandeep (@amandeep_931866)

ఈ ఘటన అనంతరం అధికారులు ఆమె ఆస్తులపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. అమన్‌దీప్ కౌర్‌కు మహేంద్ర థార్‌తోపాటు ఆడి, రెండు ఇన్నోవా కార్లు, బుల్లెట్ బైక్‌, రెండు కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు, ఖరీదైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ద్వారా వాటిని కొనుగోలు చేసిందా? లేదా..? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఆమెకు ఎవరైనా అధికారులు సహకరించారా?.. నెట్‌వర్క్‌, ఆమె వెనుక ఎవరెవరు ఉన్నారు..? అనే విషయాలపై కూడా ఆరాతీస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..