బిస్కెట్స్ అంటే ఇష్టపడని వారుందరంటే అతిశయోక్తికాదు. కరకరలాడే బిస్కెట్స్‌లో టీలో ముంచి తింటే ఆ మజానే వేరు. కొంతమందికి మ్యారీగోల్డ్ బిస్కెట్లు ఇష్టం, మరికొంతమందికి క్రీమ్ బిస్కెట్లు ఇష్టం. కొంతమంది క్రీమ్ బిస్కెట్లు ఇష్టపడతారు
TV9 Telugu
అయితే మీరెప్పుడైనా గమనించారా? ఈ బిస్కెట్లపై చాలా చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు కూడా వివిధ డిజైన్లలో ఇమిడి ఉంటాయి. ఆ డిజైన్‌ను కత్తిరించడానికే ఈ కోత పెట్టారని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి అసలు కథ అది కాదు
TV9 Telugu
సాధారణ బిస్కెట్స్ మొదలు క్రాకర్స్, బర్బన్స్ వరకూ అన్నింట్లో ఇవి కనిపిస్తుంటాయి. అయితే, వీటి వెనక పెద్ద కారణమే ఉందని బిస్కెట్ల తయారీదార్లు చెబుతున్నారు
TV9 Telugu
వాస్తవానికి వీటిని డాకర్ హోల్స్ అని పిలుస్తారట. ఈ రంధ్రాల కారణంగానే బిస్కెట్స్‌ను అన్ని వైపులా ఒకే విధంగా బేక్ చేయడం సాధ్యమవుతుందట. బిస్కెట్ తయారీ సందర్భంగా వాటి ఆకృతి చెడిపోకుండా ఉండేందుకు ఈ డాక్టర్ హోల్స్ పెడుతుంటారు
TV9 Telugu
మార్కెట్లో లభించే చాలా బిస్కెట్లు పిండి, చక్కెర, ఉప్పు వంటి పదార్థాలతో కలిపి తయారు చేస్తారు. ఈ పదార్థాలన్నింటినీ కలిపి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా బిస్కెట్లు తయారు చేస్తారు
TV9 Telugu
ఫలితంగా, బిస్కెట్లు కాల్చినప్పుడు సహజంగానే పైకి ఉబ్బుతాయి. ఇలా ఉబ్బడాన్ని నివారించడానికి వాటిపై రంధ్రాలు ముందుగానే తయారీ దారులు పెడతారు
TV9 Telugu
బిస్కెట్ సైజును బట్టి ఈ రంధ్రాలు ఎన్నెన్ని ఎక్కడెక్కడ ఉండాలో కచ్చితత్వంతో లెక్కించి ప్రత్యేక యంత్రాల సాయంతో ఏర్పాటు చేస్తారు. దీంతో, బిస్కెట్ చివర్ల నుంచి మధ్య వరకూ అంతటా ఒకేలా బేక్ అయ్యి రుచి అద్భుతంగా కుదురుతుంది
TV9 Telugu
రంధ్రాలు ఉండటం వల్ల బిస్కెట్లు ఆకారం పర్ఫెక్ట్‌గా ఉంటాయి. తినడానికి కరకరలాడేలా చేస్తాయి. ఒకవేళ ఈ రంధ్రాలు లేకపోతే అధిక ఉష్ణోగ్రతల వద్ద బిస్కెట్ రూపురేఖలు మారిపోతాయి