Viral Video: అచ్చం మనిషి లెక్కనే మాట్లాడుతున్న కాకి… నెటిజన్స్‌ను ఫిదా చేస్తోన్న కాకి పలుకులు
చిలుక పలుకుల గురించి వినే ఉంటారు. పెంపుడు చిలుకకు మాటలు నేర్పడం ద్వారా అది అచ్చం మనిషి లాగానే మాట్లాడుతుంది. మనిషి లాగే మాట్లాడే పక్షి చిలుక ఒక్కటే. ఈ వీడియో చూస్తే మాత్రం ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. కావ్ కావ్‌మని అరవాల్సిన కాకి కాకా.. కాకా.. అని అరిచింది. అరవడమే కాదు.. బూతులు కూడా...

చిలుక పలుకుల గురించి వినే ఉంటారు. పెంపుడు చిలుకకు మాటలు నేర్పడం ద్వారా అది అచ్చం మనిషి లాగానే మాట్లాడుతుంది. మనిషి లాగే మాట్లాడే పక్షి చిలుక ఒక్కటే. ఈ వీడియో చూస్తే మాత్రం ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. కావ్ కావ్‌మని అరవాల్సిన కాకి కాకా.. కాకా.. అని అరిచింది. అరవడమే కాదు.. బూతులు కూడా తిడుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం పాల్ఘర్‌లోని ఒక స్థానిక మహిళ పెంచిన కాకి “కాకా, కాకా, కాకా ఆయియే నా” అని మాట్లాడుతుండటం కనిపిస్తుంది. పాల్ఘర్‌లోని వాడా తాలూకాలోని మారుమూల ప్రాంతంలో తనూజా ముక్నే అనే మహిళ ఈ పక్షిని పెంచినట్లు తెలుస్తోంది.
తనుజ మూడు సంవత్సరాల క్రితం తన తోటలో నుంచి కాకిని తీసుకొచ్చింది.15 రోజులు ఆ కాకితోనే గడిపి ఆహారం, నీళ్లు పెడుతూ జాగ్రత్తుగా చూసుకుంది. ఆ సమయంలోనే అది తనుజ కుటుంబ సభ్యులను గమనిస్తూ మాటలు నేర్చుకుందట. కాకి మాట్లాడుతున్న సమయంలో వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ కాకి టాలెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిని ప్రకృతి అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.
అయితే మరికొందరు సోషల్‌మీడియా వినియోగదారులు మాత్రం అది ఫేక్ అంటూ కొట్టిపడేస్తున్నారు. కాకికి మాటల డబ్బింగ్ చెప్పి వీడియో తయారు చేసినట్లున్నారని పోస్టులు పెడుతున్నారు.
కాకి మాట్లాడుతున్న వీడియో చూడండి:
View this post on Instagram