Archana Gautam: బికినీతో అందాలు ఆరబోసిన తెలుగు నటి.. అర్చన గౌతమ్‌కు అసెంబ్లీ టికెట్ కేటాయించిన కాంగ్రెస్
Archana Gautam: మీరట్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో రెండింటికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థులను ప్రకటించింది. మోడల్, నటి అర్చన గౌతమ్ హస్తినాపూర్ అసెంబ్లీ స్థానానికి,
Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాలకు కాంగ్రెస్(Congress) అభ్యర్థులను గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మీరట్(Meerut)లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో రెండింటికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థులను ప్రకటించింది. మోడల్, నటి అర్చన గౌతమ్(Archana Gautam) హస్తినాపూర్ అసెంబ్లీ స్థానానికి, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ బబితా సింగ్ గుర్జార్ కిథోర్ అసెంబ్లీ స్థానానికి ఎంపిక చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). బబితా సింగ్ గుర్జార్ చాలా కాలంగా పార్టీలో చురుకుగా ఉండగా అర్చన గౌతమ్ కొత్త ముఖం.
యూపీలోని మీరట్‌లో జన్మించిన అర్చన గౌతమ్ వయసు కేవలం 26 ఏళ్లు. నట ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంది. మోడల్, నటి అర్చన గౌతమ్ వృత్తిరీత్యా బికినీ గర్ల్‌గా కూడా ఫేమస్. మిస్ బికినీ ఇండియా 2018 అందాల పోటీలో అర్చన విజేతగా నిలిచారు. అర్చన గౌతమ్ IIMT నుండి BJMC పూర్తి చేశారు. మిస్ ఉత్తరప్రదేశ్ 2014, మిస్ కాస్మో ఇండియా 2018తో సహా ఆమె అనేక టైటిల్స్ సొంతం చేసుకున్నారు. ఆమె హిందీ చిత్రాలలో గ్రేట్ గ్రాండ్ మస్తీ, హసీనా పార్కర్‌తో సహా అనేక తమిళ, సౌత్ చిత్రాలలో కూడా పనిచేశారు. జంక్షన్ వారణాసి వంటి సినిమాలో ఆమె బలమైన పాత్రను పోషించింది.
అర్చన గౌతమ్ జర్నలిజం చదివారు. చదువు పూర్తయ్యాక మోడలింగ్, యాక్టింగ్ మొదలుపెట్టింది. అర్చన 2014లో మిస్ యూపీగా ఎన్నికైంది. గ్లామర్ ప్రపంచంలో ఆమెకు ఇదే తొలి విజయం. ఈ ఏడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేస్తున్న ‘గర్ల్ హూన్, లడ్ సక్తి హూన్’ ప్రచారానికి ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చానని అర్చన గౌతమ్ చెప్పారు.
ఇదిలావుంటే, 2012లో హస్తినాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ కాళి పోటీ చేశారు. ఆ సమయంలో ఆర్‌ఎల్‌డీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. 2017లో పొత్తు కారణంగా ఈ సీటు ఎస్పీ ఖాతాలోకి వెళ్లింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. అదే సమయంలో 2007లో కిథోర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వాహిద్ పోటీ చేశారు. 2012లో పొత్తు కారణంగా ఈ సీటు ఆర్‌ఎల్‌డీకి, 2017లో ఎస్పీకి దక్కింది. 15 ఏళ్ల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ మహిళా అభ్యర్థిగా అర్చన గౌతమ్‌ను బరిలోకి దింపింది.
ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. తొలి జాబితాలో 50 మంది మహిళలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. టిక్కెట్ల పంపిణీలో మహిళలకే ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి అర్చన గౌతమ్‌కు కాంగ్రెస్ టిక్కెట్టు ఇచ్చింది. కాగా, ఈ సీటును అర్చనా గౌతమ్‌కు టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీకి అర్చన గౌతమ్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Also… Punjab: ఎన్నికల వేళ పంజాబ్ లో ఆర్డీఎక్స్ కలకలం.. భారీమొత్తంలో దొరికిన విధ్వంసకర కెమికల్!