UP Assembly Elections 2022: యూపీ ఓటర్లు ఎవరి వైపు..? టీవీ9 భారత్‌వర్ష్ ఒపీనియన్ పోల్ ఏం చెబుతోంది?

రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరి కొన్నిరోజుల్లోనే ప్రారంభం కానున్న ఎన్నికలకు ప్రాచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

UP Assembly Elections 2022: యూపీ ఓటర్లు ఎవరి వైపు..? టీవీ9 భారత్‌వర్ష్ ఒపీనియన్ పోల్ ఏం చెబుతోంది?
Uttarpradesh Assembly Elections 2022 Openion Poll
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 07, 2022 | 7:10 PM

UP Assembly Elections 2022: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరి కొన్నిరోజుల్లోనే ప్రారంభం కానున్న ఎన్నికలకు ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీని కైవసం చేసుకున్న పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం లభిస్తుందనే నమ్మకం అన్ని రాజకీయపక్షాలతో పాటు.. ప్రజలలోనూ గట్టిగా ఉంది. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజీపీతో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. కొన్ని స్థానాల్లో ఎంఐఎం పార్టీ కూడా గట్టి పోటీని ఇస్తోంది. యూపీ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. దాదాపుగా చతుర్ముఖ పోటీగా మారిన ఈ ఎన్నికల్లో అడ్డంకులు అధిగమించి బీజేపీ తన అధికారం నిలుపుకుంటుందా? చావో రేవో అంటూ రంకెలు వేస్తున్న ఎస్పీ మళ్ళీ యూపీలో చక్రం తిప్పుతుందా? బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కింగ్ లేదా కింగ్ మేకర్లు అవుతాయా అన్న పలు ప్రశ్నలు దేశవ్యాప్తంగా ప్రజలందరి మనసుల్లోనూ వెల్లువెత్తుతున్నాయి.

టీవీ9 భారత్ వర్ష ఈ ప్రశ్నలకు సమాధానాన్ని కనుగొనే ప్రయత్నం చేసింది. ఈనెల 10వ తేదీన మొదలై ఏడు విడతలుగా సాగే యూపీ ఎన్నికల్లో జననాడి ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో భాగంగా వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది టీవీ9. వారి అభిప్రాయాలను క్రోడీకరించి.. యూపీ ప్రజలు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారనే అంశాన్ని విశ్లేషించింది టీవీ9. తొలివిడత పోలింగ్ అతి దగ్గరలో ఉన్న సమయంలో.. టీవీ9 సర్వేలో యూపీ ప్రజల అభీష్టం ఎలా ఉందనేది పూర్తి విశ్లేషణాత్మకంగా ఇప్పుడు చూద్దాం.

మళ్ళీ బీజేపీదే అధికారం..

టీవీ9 సర్వే ప్రకారం మొత్తం యూపీలో 403 సీట్లలో మొత్తం 205 నుంచి 221 వరకూ సీట్లను గెలుచుకుని బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అదేవిధంగా సమాజ్ వాదీ పార్టీ 144 నుంచి 158 సీట్లను గెలుచుకుని రెండో అతి పెద్ద పార్టీగా అవతరించవచ్చు. ఇక బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(BSP) 21 నుంచి 31 సీట్లను గెలుచుకోవచ్చునని అంచనా వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 7 స్థానాలకు పరిమితం కావచ్చునని తేలింది. ఇక ఇతరులు యూపీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించే అవకాశాలు లేవని సర్వే స్పష్టం చేస్తుంది. ఇక్కడ 0 నుంచి 2 సీట్లు మాత్రమే ఇతరులకు అవకాశం ఉంది.

యూపీ ఎన్నికల ఒపీనియన్ పోల్‌లో విడతల వారీగా పార్టీలు గెలుపొందగలిగే సీట్ల వివరాలు ఇవే..

Up Elections 1

Up Elections 1

కొద్దిపాటి తేడా..

ఒపీనియన్ పోల్ లో ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే బీజేపీ-సమాజ్ వాదీ పార్టీల మధ్యలో ఓట్ల శాతంలో చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంది. కేవలం 3 శాతం మాత్రమే రెండు పార్టీల మధ్య వ్యత్యాసం. అయితే, ఈ మూడు శాతం దాదాపు 60 సీట్లలో బీజేపీకి ఆధిక్యం దక్కుతుందని అంచనా వేస్తున్నారు.  మొత్తం ఓట్ల శాతంలో బీజేపీకి 40.5% ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. అదేసమయంలో సమాజ్ వాదీ పార్టీ 37 శాతం ఓట్లను సాధించవచ్చు. ఇక బీఎస్పీ 15.6% ఓట్లను సంపాదించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓటింగ్ శాతం 2.0% మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. ఇతరులకు 2.0% శాతం ఓట్లు లభించవచ్చునని సర్వేలో తేలింది.

బీజేపీకి జై అంటున్న మహిళలు..

ఉత్తరప్రదేశ్ లో మహిళలు భారతీయ జనతా పార్టీకి జై అంటున్నారు. ఈ విషయం టీవీ9 ఒపీనియన్ పోల్ లో స్పష్టం అయింది. ఒపీనియన్ పోల్ లో వ్యక్తమైన అభిప్రాయాల ప్రకారం యూపీలో పురుషులు 41.9% బీజేపీని సమర్ధిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీకి ఒటేస్తామని 36.1% అంటున్నారు. ఇక బీఎస్పీకి 15.2%, కాంగ్రెస్ పార్టీకి 4.8% పురుషులు మద్దతు పలుకుతున్నారు. మహిళల విషయానికి వస్తే 46.7% మంది తాము బీజేపీకే ఓటేస్తామని స్పష్టం చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీకి 28.0% మహిళలు మద్దతు పలుకుతుండగా 17.5% బీఎస్పీకి, 5.6% మంది కాంగ్రెస్ కు తమ ఓటు ఇస్తామని చెబుతున్నారు. మొత్తంగా మహిళా ఓటర్లు బీజేపీ వైపు స్పష్టంగా ఉన్నట్టుగా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

Up Elections 2 Copy

Up Elections 2 Copy

యువత..వయోజనులు బీజేపీ వైపే..

యూపీ ఎన్నికల్లో వయోజనులు అంటే 56 ఏళ్ల పైబడిన వారిలో సగానికి పైగా భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది. ఇక యువత కూడా బీజేపీ వైపే చూస్తోంది. అయితే, కొత్త ఓటర్లు.. 23 ఏళ్ల లోపు వారు రెండు పార్టీల వైపు సమానమైన మొగ్గు చూపించారు. వీరిలో 39.1 శాతం బీజేపీకి ఓటేస్తామని చెప్పగా.. 38.6 శాతం సమాజ్ వాదీ పార్టీని ఎంచుకున్నట్టు చెప్పారు. ఇక ఎస్పీకి 15.3 శాతం.. కాంగ్రెస్ పార్టీకి 4.8 శాతం మద్దతు పలికారు. అలాగే 46 నుంచి 55 ఏళ్ల వారిలో 45.8% బీజేపీకే తమ ఓటు అని స్పష్టం చేశారు. సమాజ్ వాదీ పార్టీ వైపు చూస్తున్నట్టు 34.5% చెప్పారు. అదేవిధంగా ఈ వయసువారిలో 9.8% బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి మద్దతు పలుకుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి 8.1% తాము ఓటేస్తామని చెప్పారు.

వయసు వారీగా ఏ పార్టీలకు ఎంతమంది మద్దతు పలికుతామని చెప్పారో కింది ఫోటోలో చూడొచ్చు.

Up Elections 3 Copy

Up Elections 3 Copy

హిందువులతో పాటు.. వెనుకబడిన వర్గాలు కూడా బీజేపీ కావాలని కోరుకుంటున్నాయి..

ఇక సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే కనుక.. దళితులు బీఎస్పీ వైపే ఎక్కువ చూస్తున్నారు. దళితుల్లో 46.9% మంది బీఎస్పీకి ఓటు ఇస్తామని చెప్పారు. అయితే, ఇక్కడ దళితుల ఓట్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఆ వర్గం దూరం అయిన విషయం స్పష్టం అవుతోంది. కేవలం 4.1% మంది మాత్రమె కాంగ్రెస్ కు ఓటేస్తామని చెప్పడం గమనార్హం. ఇక బీజేపీకి 37.1% ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీకి 11.2% దళితులు ఓటు ఇస్తామని చెప్పారు. ఇక ఉన్నత కులాల హిందువుల్లో బీజేపీ పై నమ్మకం ఏమాత్రం సడలలేదు. వారిలో 71% మంది విస్పష్టంగా బీజేపీనే సమర్ధిస్తున్నారు. ఇక ముస్లిం ఓటర్లలో ఎక్కువ శాతం 66.9% సమాజ్ వాదీ పార్టీ వైపు నిలుస్తున్నట్టు చెప్పారు. కాగా బీఎస్పీ వైపు 11.1%, 10.1% కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇక బీజేపీకి 9.0% మంది ముస్లింలు మాత్రమె మద్దతు పలుకుతున్నారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు ఇలా ఉన్నాయి:

Up Elections 4 Copy

Up Elections 4 Copy

విడతల వారీగా ఇలా..

ఇక ఏడు విడతల్లో యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. విడతల వారీగా ఏ పార్టీకి ఎలా ఓటర్లు మద్దతు పలుకుతామని చెబుతున్నారో కింది ఇమేజ్ లో తెలుసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ తిరిగి ఉత్తర ప్రదేశ్ లో విజయబావుటా ఎగుర వేసే సూచనలు ఉన్నట్టు టీవీ9 భారత్ వర్ష ఒపెనియన్ పోల్ స్పష్టం చేస్తోంది.

Up Elections 5 Copy

Also Read: 

PM Modi: కాంగ్రెసోళ్లకు నేనంటే ప్రాణం.. నన్ను తలవకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు: లోక్‌సభలో ప్రధాని విమర్శలు

T Congress: ఆ కామెంట్స్ సరికాదు.. పార్లమెంట్ ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసన..