Durai Murugan: స్టాలిన్‌తో పాటు ప్రమాణం చేసిన దురైమురుగన్‌కు ఘనమైన చరిత్రే ఉంది!

ఈ రోజు ఉదయం తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎంకే స్టాలిన్ తో పాటు మంత్రిగా ప్రమాణం చేసిన డీఎంకే సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌కు రాజకీయంగా అపార అనుభవం ఉంది.

Durai Murugan: స్టాలిన్‌తో పాటు ప్రమాణం చేసిన దురైమురుగన్‌కు ఘనమైన చరిత్రే ఉంది!
Durai Murugan
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: May 07, 2021 | 3:21 PM

Durai Murugan: ఈ రోజు ఉదయం తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎంకే స్టాలిన్ తో పాటు మంత్రిగా ప్రమాణం చేసిన డీఎంకే సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌కు రాజకీయంగా అపార అనుభవం ఉంది. దాంతో పాటు కాసింత చెడ్డ పేరు కూడా ఉంది. ఇప్పుడాయన వయసు 82 ఏళ్లు.. 1989, మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు జయలలిత తలపై కొట్టి, ఆమె చీరను ఉద్దేశపూర్వకంగా లాగింది దురైమురుగనే! అప్పుడు జయలలిత వయసు 40 ఏళ్లు. దురైమురుగన్‌ వయసు 51 ఏళ్లు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దురైమురుగన్ ఆయన కాబినెట్‌లో సభ్యుడు. మళ్లీ ఇప్పుడు 68 ఏళ్ల స్టాలిన్ కేబినెట్‌లో 82 ఏళ్ల మురుగన్ చేరుతున్నారు. ఆయన మొదటిసారి 1971లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన కాట్‌పాడి నియోజకవర్గం ఎమ్మెల్యే. ఇది చిత్తూరు జిల్లా సరిహద్దులో ఉంటుంది. కాట్‌పాడి, రాణిపేట నియోజకవర్గాల నుంచి ఈయన 12 సార్లు పోటీ చేసి పది సార్లు విజయం సాధించారు. కరుణానిధి మరణించిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దురైమురుగన్‌కు కష్టాలు తప్పలేదు. 1938 జులై 1న పుట్టిన ఆయన ఇప్పుడు మరోసారి మంత్రి అయ్యారు . ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 1978లో గెలిచిన ఎమ్మెల్యేలలో చంద్రబాబు ఒక్కరే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.. 1971లో గెలిచినవారిలో ఒక్కరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా లేరు..

Durai Murugan. 1

Durai Murugan.

తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. ఈ వివరాలను అలా ఉంచి అసలు 1989, మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో ఏం జరిగిందో క్లుప్తంగా తెలుసుకుందాం! ఆ రోజు బడ్జెట్‌ సమావేశం ప్రారంభమయ్యింది. జయలలితను ఇబ్బందిలో పెట్టి విజయం సాధించిన ఆనందంలో కరుణానిధి ఉన్నారు. అప్పుడు ఆర్ధికశాఖ కూడా ఆయన దగ్గరే ఉండింది. బడ్జెట్‌ ప్రసంగాన్ని కరుణానిధి మొదలు పెడుతున్నప్పుడే కాం్రెస్‌కు చెందిన కుమరి ఆనందన్‌ ..ప్రతిపక్ష నాయకురాలు జయలలితపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, ఆమె సభాహక్కులకు భంగం కలిగించారంటూ పాయింట్ ఆఫ్‌ ఆర్డర్‌ను లేవనెత్తారు. అప్పుడు హోం శాఖ కూడా కరుణానిధి చెంతనే ఉంది. అందుకే దీని గురించి చర్చించాలని స్పీకర్‌ను కోరారు కుమరి ఆనందన్‌. ఆ వెంటనే జయలలిత కూడా కరుణానిధిపై ఆరోపణలను గుప్పించారు. సీఎం ఆదేశాల మేరకే తనను పోలీసులు వేధిస్తున్నారని, తన టెలిఫోన్‌ను ట్యాప్‌ చేశారని అన్నారు. తన హక్కులకు భంగం కలిగించినందుకు ముఖ్యమంత్రి కరుణానిధిపైనా, మంత్రి దురైమురుగన్‌పైనా చర్య తీసుకోవాలని స్పీకరును కోరారు. జయలలిత మాట్లాడుతున్న సమయంలోనే జయలలితతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకున్న పిఎచ్‌ పాండ్యన్‌ లేచి జయలలితను నానా మాటాలన్నారు. ఇందులో కొన్ని బూతులు కూడా ఉన్నాయి. అందుకే స్పీకర్‌ ఆయన మాటలను రికార్డులను నుంచి తొలగించారు. పాండ్యన్‌ మాటలతో సభలో చిన్నపాటి గొడవ మొదలయ్యింది. ఇక్కడో సంగతి చెప్పుకోవాలి. తదనంతర పరిస్థితులలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఈయనే ఆమె కాళ్ల మీద పడి పార్టీలో చేర్చుకోమని బతిమాలారు. తమిళనాడు రాజకీయాలు ఇలాగే ఉంటాయి.

Durai Murugan.2

Durai Murugan.

సరే.. సభలో గొడవ జరుగుతుండటంతో స్పీకర్‌ ప్రివిలేజ్‌ మోషన్‌ అనుమతించబోనని చెప్పేశారు. దాంతో అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. గట్టిగా కేకలు వేయసాగారు. వీటినేమీ కరుణానిధి పట్టించుకోకుండా బడ్జెట్‌ ప్రసంగం మొదలు పెట్టారు. క్రిమినల్‌ ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి బడ్జెట్‌ను సమర్పించడానికి తగడు అంటూ జయలలిత కేకలు పెట్టారు. దాంతో సహనం కోల్పోయిన కరుణానిధి వెళ్లి శోభన్‌బాబును అడుగు అంటూ నోరు జారారు. శోభన్‌బాబు ప్రస్తావన రావడంతో జయలలితలో కోపం తన్నుకువచ్చింది. ఆ ఆగ్రహంతోనే వాడిని కొట్టండిరా అంటూ తన ఎమ్మెల్యేలతో చెప్పారు. అంతే సెంగోట్టయన్‌ కరుణానిధిపై దూసుకెళ్లి ఆయనను తోసేశారు. కిందపడ్డ కరుణానిధి కళ్లద్దాలు విరిగిపోయాయి. దీంతో డీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోయారు. అన్నాడీఎంకే సభ్యుల మీద పడి కొట్టసాగారు. అసెంబ్లీ రణక్షేత్రమయ్యింది. ఫైళ్లు, మైకులు గాలిలో చక్కర్లు కొట్టాయి. చెప్పులు కూడా విసురుకున్నారు. డీఎంకే సభ్యుల టార్గెట్‌ అంతా జయలలితపైనే ఉండింది. అందుకే ఆమె తలకు, కుడి చేతికి, మోకాలికి, వెన్నుకు గాయాలయ్యాయి. ఇక పీడబ్ల్యూడీ మంత్రి దురై మురుగన్‌ అయితే జయలలితపై మీదకొచ్చేసి ఆమె కొంగు పట్టుకుని లాగాడు. ఈ గొడవలో జయలలిత చీర చిరిగిపోయింది. కిందపడిపోయింది. 20 నిమిషాల్లో సభ ముగిసింది. కానీ ఈ దుస్సంఘటన మాత్రం చరిత్రలో మిగిలిపోయింది. కరుణానిధి లాంటి పెద్దమనిషి అలా అని ఉండాల్సి కాదు. పురుషాహంకారంతో ఆయన చేసిన వ్యాఖ్య ఆయనను జీవితాంతం వెంటాడింది.. జయలలితకు జరిగిన పరాభవం తమకు జరిగినట్టే ఫీలయ్యారు తమిళనాడు ప్రజలు.. అందుకే ఆ తర్వాతి ఎన్నికల్లో కరుణానిధిని పక్కకు తోసేశారు. జయకు పట్టం కట్టారు.

Durai Murugan.3

Durai Murugan.