Goa Election 2022: నా పోరాటం కేవలం బీజేపీపైనే.. ఉత్పల్ పారికర్ కీలక వ్యాఖ్యలు..
Utpal Parrikar on BJP: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో గోవా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. గోవా మాజీ సీఎం,
Utpal Parrikar on BJP: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో గోవా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. గోవా మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ తన తండ్రి నియోజకవర్గమైన పనాజీ నుంచి గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉత్పల్ (Utpal Parrikar) కు పనాజీ టికెట్‌ను కేటాయించపోవడంతో ఆయన బీజేపీ (BJP) ని గతవారం వీడారు. ఈ క్రమంలో తాను బీజేపీకి వ్యతిరేకంగా పనాజీలో పోటీచేయనున్నట్లు ఉత్పల్ పారికర్ వెల్లడించారు. నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడిన ఉత్పల్.. ఎన్నికల్లో గెలిచినా తాను తిరిగి బీజేపీలోకి చేరనని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం ఆప్, టీఎంసీ, కాంగ్రెస్‌పై కాదని.. కేవలం BJPకి వ్యతిరేకంగానే అని ఉత్పల్ స్పష్టం చేశారు. బీజేపీ తనకు రెండు, మూడు సీట్లు ఇచ్చిందని ప్రమోద్ సావంత్ (గోవా సిఎం) చెబుతున్నారు.. అయితే నిజం ఏమిటంటే ఆ పార్టీ నాకు పనాజీ నుండి పోటీ చేసేందుకు ఎప్పుడూ టిక్కెట్ ఇవ్వలేదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచినా తిరిగి బిజెపిలో చేరనన్నారు. పనాజీలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మహాలక్ష్మి ఆలయంలో ఉత్పల్ పూజలు చేశారు.
ఉత్పల్ తన తండ్రి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన పనాజీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. అయితే బీజేపీ పనాజీలో కాంగ్రెస్ మాజీ నేత, అక్కడి ఎమ్మెల్యే అటానాసియో బాబూష్ మాన్‌సెరాటేకు టికెట్ ఇచ్చింది. బీజేపీ ఇతర ఎంపికలతో ఉత్పల్‌కు హామీ ఇచ్చినప్పటికీ.. పారికర్ కుమారుడు పనాజీ నుంచి ఎన్నికల బరిలోకి దిగడం బీజేపీకి తలనొప్పిగా మారింది. అయితే.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), టీఎంసీ (TMC), శివసేన వంటి ప్రతిపక్ష పార్టీలు తమ ఎన్నికల గుర్తుపై ఎన్నికలలో పోటీ చేయమని ఉత్పల్‌ను ఆహ్వానించినప్పటికీ.. వారి ప్రతిపాదనను ఉత్పల్ తిరస్కరించి స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
కాగా.. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read: