Exit Poll Results 2022 Updates: ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వైపు ఓటరు దేవుడు మొగ్గు.. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో సంచలనాలు..
Assembly Elections Exit Poll Results 2022 updates in Telugu: ఓటర్లు నాడి ఎలా ఉందో తెలుసుకోడానికి పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను రూపొందించాయి. ఒక పార్టీకి సంపూర్ణ మెజార్టీ దక్కుతుందా? హంగ్ ఏర్పడుతుందా? అనేది తేలిపోనుంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు హాట్ హాట్‌గా ముగిశాయి. అయితే.. పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ – ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మార్చి 10న వెలువడనున్నాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది పలు సంస్థలు, మీడియా వెల్లడించనున్నాయి. యూపీలో చివరి దశ పోలింగ్ ముగిసిన వెంటనే.. ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. చివరి దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల సంఘం విధించిన నిషేధం కూడా ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కాగా.. టీవీ 9 (TV9) కూడా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఓటర్లు నాడి ఎలా ఉందో తెలుసుకోడానికి పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను రూపొందించాయి. ఒక పార్టీకి సంపూర్ణ మెజార్టీ దక్కుతుందా? హంగ్ ఏర్పడుతుందా? అనేది తేలిపోనుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? పంజాబ్‌లో కాంగ్రెస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? లేక ఆమ్ ఆద్మీ పార్టీ తన మ్యాజిక్ చేయగలదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే గురువారం వరకు ఆగాల్సిందే. కానీ TV9 / Pollstart ఈరోజు వచ్చే ఫలితాలకు అత్యంత సన్నిహితమైన ట్రెండ్‌ను విడుదల చేయనుంది. ఇవాళ్టితో తుదిదశ పోలింగ్ కంప్లీట్ కావడంతో.. ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారనే అంచనాను ఇప్పుడు చూద్దాం.
ఐదు రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు..
ఉత్తర ప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 15,05,82,750. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 1,74,351.
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం సీట్లు 403. వీటిలో 84 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ చేయబడ్డాయి. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీలు) రిజర్వు అయ్యాయి.
యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
పంజాబ్: పంజాబ్‌లో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 2,13,88,764. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 24,689.
పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 34 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ అయ్యాయి.
ఇక్కడ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 82,38,187. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 11,647.
ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 13 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ కాగా.. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ అయ్యాయి.
పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
గోవా: గోవాలో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 11,56,762. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 1,722.
గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కేవలం పెర్నెం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే షెడ్యూల్డ్ కులాల (SCలు) కోసం రిజర్వ్ చేశారు.
ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
మణిపూర్: మణిపూర్‌లో ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 20,56,901. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 2,959.
మణిపూర్‌లో 60 స్థానాలు ఉన్నాయి. వీటిలో 19 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) కోసం రిజర్వ్ అయ్యాయి. సెక్మాయి నియోజకవర్గం మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ అయింది.
ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
LIVE NEWS & UPDATES
-
యూపీలో యోగికే మళ్లీ బ్రహ్మరథం , పంజాబ్‌లో ఆప్ ఘనవిజయం..
యూపీలో యోగికే మళ్లీ బ్రహ్మరథం , పంజాబ్‌లో ఆప్ ఘనవిజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గోవా,ఉత్తరాఖండ్‌లో బీజేపీ -కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
-
ఉత్తరాఖండ్‌లో బీజేపీ దూకుడు.. CNX ఎగ్జిట్ పోల్ సంచలనం
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2022 కోసం CNX ఎగ్జిట్ పోల్
బీజేపీ 35 నుండి 43 సీట్లు
కాంగ్రెస్ 24 నుండి 32 సీట్లు
AAP 0 సీట్లు
ఇతరులకు 2 నుండి 4 సీట్లు
-
-
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2022: గ్రౌండ్ జీరో ఎగ్జిట్ పోల్స్ ఏమి చెబుతున్నాయి?
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2022కి సంబంధించి గ్రౌండ్ జీరో ఎగ్జిట్ పోల్స్
బీజేపీకి 25 నుంచి 29 సీట్లు
కాంగ్రెస్‌కు 37 నుంచి 41 సీట్లు
ఆప్ 00 సీట్లు
ఇతరులకు 2 నుంచి 4 సీట్లు
-
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల 2022.. గ్రౌండ్ జీరో ఎగ్జిట్ పోల్ ప్రకారం..
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల 2022 గ్రౌండ్ జీరో ఎగ్జిట్ పోల్ ప్రకారం..
బీజేపీకి 26 నుంచి 31 సీట్లు
కాంగ్రెస్‌కు 12 నుంచి 17 సీట్లు
ఎన్‌పీఎఫ్‌కి 2 నుంచి 6 సీట్లు
ఎన్‌పీపీకి 6 నుంచి 10 సీట్లు
ఇతరులకు 3 నుంచి 6 సీట్లు
-
గోవాలో స్వతంత్ర ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇస్తారు: ప్రమోద్ సావంత్
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్‌పై గోవా సీఎం ప్రమోద్ సావంత్ గోవాలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని అన్నారు. గోవాలో స్వతంత్ర ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇస్తారు. నేను కనీసం 5 వేల ఓట్లతో గెలుస్తానని సావంత్ అన్నారు. పనాజీ సీటును కూడా బీజేపీ కైవసం చేసుకుంటుంది.
-
-
మంచు కొండల్లో ఎవరంటే.. P-MARQ ఎగ్జిట్ పోల్ అంచనాలు..
ఉత్తరాఖండ్ 2022 మొత్తం స్థానాలు 70
బీజేపీ 35-39 కాంగ్రెస్ 28-34 ఆప్ 0-3 ఇతరులు 0-3
-
యూపీలో యోగీ వికాసం.. P-MARQ ఎగ్జిట్ పోల్ అంచనాలు..
P-MARQ ఎగ్జిట్ పోల్ అంచనాలు.. ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం స్థానాలు 403
బీజేపీ+ 240 ఎస్పీ+ 140 బీఎస్పీ+ 17 కాంగ్రెస్ 04 ఇతరులు 02
-
గోవాలో బీజేపీ, కాంగ్రెస్.. నువ్వా – నేనా.. P-MARQ ఎగ్జిట్ పోల్ అంచనాలు..
P-MARQ ఎగ్జిట్ పోల్ అంచనాలు.. గోవా అసెంబ్లీ 2022 మొత్తం స్థానాలు 40
బీజేపీ 13-17 కాంగ్రెస్+ 13-17 ఆప్ 02-06 టీఎంసీ+ 02-04 ఇతరులు 00-04
-
Manipur Exit Poll Result: మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ హవా.. P-MARQ ఎగ్జిట్ పోల్ అంచనాలు..
మణిపూర్ అసెంబ్లీ 2022 మొత్తం స్థానాలు 60
బీజేపీ 27- 31 కాంగ్రెస్ 11-17 ఎన్పీఎఫ్ 02-07 ఎన్పీపీ 06-10 ఇతరులు 03-07
-
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌పోల్స్
పంజాబ్ ఎన్నికల్లో మొత్తం స్థానాలు – 117
ఆప్ 76-90 కాంగ్రెస్ 19-31 అకాలీదళ్ 07-11 బీజేపీ 01-04 ఇతరులు 00-02
-
Goa Exit Poll Result: గోవాలో మరోసారి కాషాయ జెండా రెపరెపలు
టీవీ9 ఎగ్జిట్ పోల్ సర్వే మేరకు.. గోవాలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడేలా కనిపిస్తోంది. టీవీ9 పోల్‌స్ట్రాట్ సర్వేలో ఇదే తేలింది. బీజేపీ 17-19, కాంగ్రెస్ 11-13 , ఆప్ 1- 4, ఇతరులు 2-7 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.
-
UK Exit Poll Result: ఉత్తరాఖండ్‌లో ఆ రెండు పార్టీల మధ్యే హోరా హోరీ
టీవీ9 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ సర్వే మేరకు.. ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు దాదాపు సమాన విజయావకాశాలు ఉన్నట్టు చెబుతోంది. బీజేపీ 31-33 , కాంగ్రెస్ 33-35, ఆప్ 0-3, ఇతరులు 0-2 స్థానాలు గెలిచే చాన్స్ కనిపిస్తోంది.
-
Punjab Exit Poll Result: పంజాబ్ పీఠంపై ఆప్.. టీవీ9 పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్
టీవీ9 పోల్‌స్ట్రాట్ చేసిన సర్వేలో పంజాబ్ పీఠం ఈసారి ఆప్ కైవసం చేసుకోబోతున్నట్టు స్పష్టమవుతోంది. ఆప్ 56-61, కాంగ్రెస్ 24-29, అకాలీదళ్ 22-26 బీజేపీ 1-6 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
-
UP Exit Poll Result: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కమల వికాసం…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022
మొత్తం స్థానాలు – 403
బీజేపీ 211 నుంచి 225 సీట్లు రావచ్చని.. ఎస్పీకి 146 నుంచి 160 సీట్లు రావచ్చని.. కాంగ్రెస్ 4-6 బీఎస్పీలకు14 నుంచి 24 సీట్లు రావచ్చని TV9 అంచనా
-
ఎగ్జిట్ పోల్ సర్వే ఎలా చేస్తారు..
ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చే ఓటర్లతో పరస్పర జరిపిన చర్చల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్‌ను సిద్ధం చేస్తారు. అయితే పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లే సమయంలో ఓటర్లు తమ అభిప్రాయాలను సర్వే చేసేవారితో షేర్ చేసుకుంటారు ఇలా ఎగ్జిట్ సర్వేలను ఎగ్జిట్ పోల్ అంటారు.
-
యూపీలో ఎన్ని దశల్లో పోలింగ్ జరిగిందంటే..
యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో పోలింగ్ జరిగింది. పంజాబ్‌లో 117, ఉత్తరాఖండ్‌లో 70, గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. కాగా, మణిపూర్‌లో రెండు దశల్లో 60 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
-
మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్ ట్రెండ్‌లు..
ఉత్తరప్రదేశ్‌లోని ఏడో, చివరి దశ 54 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్‌లు రానున్నాయి.
Published On - Mar 07,2022 5:57 PM