Assembly Election Result today: మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఈ రాష్ట్రాల్లో రాజకీయ సిత్రాలు అన్నీఇన్నీ కాదండోయ్..!

5 State Election Result 2022: సార్వత్రిక ఎన్నిలకు సెమీఫైనల్స్‌గా చెప్పుకునే ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనున్నాయి.

Assembly Election Result today: మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఈ రాష్ట్రాల్లో రాజకీయ సిత్రాలు అన్నీఇన్నీ కాదండోయ్..!
5 State Assembly Election R
Shiva Prajapati

|

Mar 10, 2022 | 6:00 AM

5 State Election Result 2022: సార్వత్రిక ఎన్నిలకు సెమీఫైనల్స్‌గా చెప్పుకునే ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ ఎన్నికల కౌంటింగ్‌లో ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపడతారు. ఎన్నికల ఫలితాల కోసం 130 మంది పోలీస్‌ పరిశీలకులను నియమించారు. EVMలపై ఆరోపణలు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరికొన్ని గంటల్లో ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా.. ఈ రాష్ట్రాల్లో రాజకీయాలు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి.

క్యాంపు రాజకీయాలు.. గోవాలో క్యాంప్‌ రాజకీయాలు ఊపందుకున్నాయి. అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ ఫోకస్‌ పెంచాయి. కాంగ్రెస్‌ తన అభ్యర్థులను మరో రిసార్ట్‌కు మార్చింది. ఇప్పటికే గోవాలొ చిదంబరం, DKశివకుమార్‌, దినేష్‌ గుండూరావు మకాం వేశారు. ఇక బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఫడ్నవీస్‌ కూడా గోవాకు వెళుతున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో బీజేపీ టచ్‌లో ఉంది.

లాల్‌టోపీ పోలీసింగ్‌.. యూపీలోని మొరాదాబాద్‌లో స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి వచ్చిపోయే వాహనాలను సమాజ్‌వాది నేతలు నిశితంగా తనిఖీ చేశారు. కారును, వాటర్‌ ట్యాంకర్‌ను కూడా పూర్తిగా చెక్‌ చేస్తున్నారు. EVMలు గల్లంతు అవుతున్నాయని అఖిలేష్‌ ఆరోపణలు చేయడం, ఇద్దరు అధికారుల సస్పెన్షన్‌ నేపథ్యంలో యూపీవ్యాప్తంగా సమాజ్‌వాదీ కార్యకర్తలు ఇదేతరహాలో నిఘాపెట్టారు.

ఇదో రకం జాగారం.. యూపీలో శివరాత్రి వంటి జాగారాలు నడుస్తున్నాయి. నోయిడాలో సమాజ్‌వాది పార్టీ శ్రేణులు స్ట్రాంగ్‌రూమ్‌ బయట గానా బజానా చేస్తూ కనిపించారు. పాటలతో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి సీన్లే ఎక్కడచూసినా కనిపిస్తున్నాయి.

పంజాబ్‌లో సీన్‌ మారింది.. ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పగానే పంజాబ్‌లో సీన్‌ మారిపోయింది. ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ ఇంటిదగ్గర పోలీస్‌ భద్రత వెంటనే పెరిగిపోయింది. వాస్తవానికి ఫలితాలు వచ్చిన తర్వాత ఇలాంటి సీన్‌ కనిపిస్తుంది. కానీ ఎగ్జిట్‌పోల్స్‌ మూకుమ్మడిగా ఒకేమాట చెప్పడంతో భగవంత్‌ మాన్‌ ఇంటిదగ్గర భద్రతను పెంచారు. తమకు 80 సీట్లు వస్తాయనీ, 100కి కూడా వెళ్లొచ్చన్నారు భగవంత్‌ మాన్‌. ఇక ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ సొంతూరులో పండగ వాతావరణం కనిపిస్తోంది. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఆయన పోస్టర్లతో ఇళ్లు నిండిపోయాయి. ఒక మారుమూల పల్లె నుంచి సామాన్యుడైన ఒక వ్యక్తి – పంజాబ్‌ సీఎం అవుతున్నాడనీ, ఇది తమకు గర్వకారణమని అక్కడివారు అంటున్నారు.

అన్నీ ఒకే రాగం.. ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ ఒకేరాగంలో కూత పెడుతున్నాయి. లోక్‌నీతి-CSDS ఎగ్జిట్‌పోల్‌ కూడా ఇదే చెప్పింది. యూపీలో బీజేపీ, పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ విజయం తథ్యమని ఈ పోల్‌ వెల్లడించింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు యూపీలో 43 శాతం ఓట్‌షేర్‌ సాధిస్తుందని తెలిపింది. ఇక పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ దారుణ పరాభవం తప్పదని వివరించింది.

లడ్డూ కావాలా నాయనా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు వస్తుండటంతో- రాజకీయ పార్టీలు – లడ్డూలకు ఆర్డర్‌ ఇచ్చాయి. గెలిస్తే తియ్యని వేడుక చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. పంజాబ్‌లోని లుథియానాలో లడ్డూల తయారీ జోరుగా సాగుతోంది. ఐదురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో- సాధారణ లడ్డూలు, మోతిచూర్‌ లడ్డూలు పెద్దసంఖ్యలో కొలువుదీరుతున్నాయి.

కేజ్రీవాల్‌.. ప్రధాని పాత్ర.. కేజ్రీవాల్‌ను ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన నేత రాజీవ్‌ ఛద్దా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తమ నాయకుడిని ఇక సీఎంగా కాకుండా దేశ ప్రధానిగా చూడాలని ఆయన కోరారు. దేశంలో కోట్లాదిమంది ఆశ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారాయన. పంజాబ్‌లో విజయ సంకేతాల తర్వాత ఆమ్‌ఆద్మీ స్పీడు పెరిగింది.

Also read:

Viral Video: పాముతోనే ఆటలాడాలనుకున్నాడు.. దాని రియాక్షన్‏కు దిమ్మ తిరిగిపోయింది.. షాకిండ్ వీడియో..

Chilli Price: బంగారంతో పోటీ పడుతున్న ఎర్రబంగారం.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!

Andhra Pradesh: ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ కమిషనర్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu