ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు … తీవ్ర మనోవేదనతో యువకుడు ఆత్మహత్య
అతివేగంగా కారునడిపి ఓ వ్యక్తి మరణించడానికి కారణమైన యువకుడు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. గద్వాల జోగులాంబ జిల్లా రాజోలికి చెందిన మోహన్(24) అనే యువకుడు మూడేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలో స్నేహితులతో ఒక రూమ్‌లో ఉంటూ ఏఎఫ్‌సీ బావర్చి పేరుతో బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. స్నేహితులతో కలిసి మోహన్ బుధవారం తెల్లవారుజామున పటాన్‌చెరు సమీపంలోని అనంతపద్మనాభస్వామిని దర్శించుకోడానికి కారులో బయలుదేరి వెళ్లారు. అక్కడినుంచి తిరిగి వస్తుండగా కర్దనూర్ వద్ద […]

అతివేగంగా కారునడిపి ఓ వ్యక్తి మరణించడానికి కారణమైన యువకుడు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. గద్వాల జోగులాంబ జిల్లా రాజోలికి చెందిన మోహన్(24) అనే యువకుడు మూడేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలో స్నేహితులతో ఒక రూమ్‌లో ఉంటూ ఏఎఫ్‌సీ బావర్చి పేరుతో బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాడు.
స్నేహితులతో కలిసి మోహన్ బుధవారం తెల్లవారుజామున పటాన్‌చెరు సమీపంలోని అనంతపద్మనాభస్వామిని దర్శించుకోడానికి కారులో బయలుదేరి వెళ్లారు. అక్కడినుంచి తిరిగి వస్తుండగా కర్దనూర్ వద్ద మోహన్ డ్రైవ్ చేస్తున్న కారు అదుపుతప్పి అటుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న సురేశ్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు సురేశ్ ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
తెల్లవారు జామున ఈ ఘటన జరగడంతో ఎవరీకి తెలియలేదు. అక్కడినుంచి మోహన్ ఇంటికి చేరుకుని తీవ్రంగా బాధపడి తాను నివాసముంటున్న భవనం ఐదవ అంతస్తునుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన మోహన్‌ను వెంటనే హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమద్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తాను చేసిన పనివల్ల ఓ వ్యక్తి మరణించిన విషయాన్ని తన స్నేహితులు, పరిచయస్తులకు చెప్పి తీవ్ర మనోవేదనకు గురైనట్టు వారు తెలిపారు. మోహన్ మృతితో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.