AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్సీ నంబర్ పేరుతో.. లక్షల్లో మోసం..

సైబర్ నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రోజుకో కొత్త పథకంతో అమాయకులను మోసం చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఫ్యాన్సీ మొబైల్ నంబర్లు ఇప్పిస్తామంటూ ఓ వ్యాపారిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌లోని ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యాపారి మొబైల్‌కి మీకు ఫ్యాన్సీ నంబర్ ఇస్తామంటూ మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన వ్యాపారి ఆ నంబర్‌కు కాల్ చేశాడు. మూడు ఫ్యాన్సీ నంబర్లు […]

ఫ్యాన్సీ నంబర్ పేరుతో.. లక్షల్లో మోసం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 15, 2019 | 12:09 PM

Share

సైబర్ నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రోజుకో కొత్త పథకంతో అమాయకులను మోసం చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఫ్యాన్సీ మొబైల్ నంబర్లు ఇప్పిస్తామంటూ ఓ వ్యాపారిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌లోని ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యాపారి మొబైల్‌కి మీకు ఫ్యాన్సీ నంబర్ ఇస్తామంటూ మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన వ్యాపారి ఆ నంబర్‌కు కాల్ చేశాడు. మూడు ఫ్యాన్సీ నంబర్లు కావాలని కోరాడు. ఒక్కో నంబర్‌కు లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. అయితే నంబర్‌తో పాటు ఓ ఐఫోన్ ఎక్స్‌ను కూడా బహుమతిగా ఇస్తామని వ్యాపారిని నమ్మించారు. తాము చెప్పే బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయాలని చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మిన వ్యాపారి అక్షరాల మూడు లక్షల రూపాయలు పంపించాడు. కొద్ది రోజులు ఎదురుచూసినా.. సిమ్ కార్డులు రాకపోవడంతో వారికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన పోలీసులు మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఓ గ్యాంగ్ ఈ మోసానికి పాల్పడినట్లు తేల్చారు. నాసిక్ పోలీసుల సహాయంలో ఆ గ్యాంగ్ లోని నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరిస్తామని డీసీపీ రఘువీర్ తెలిపారు.

Follow Us
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి
బిగ్ బాస్ కోసం వచ్చి బుక్ అయ్యిందా.!!
బిగ్ బాస్ కోసం వచ్చి బుక్ అయ్యిందా.!!
ఘాట్‌ రోడ్డులో దడ పుట్టిస్తున్న చిరుత..!
ఘాట్‌ రోడ్డులో దడ పుట్టిస్తున్న చిరుత..!
నిన్న భగ్గుమన్న అసెంబ్లీ.. ఇవాళ ఎరుపెక్కిన ఫామ్‌హౌస్..
నిన్న భగ్గుమన్న అసెంబ్లీ.. ఇవాళ ఎరుపెక్కిన ఫామ్‌హౌస్..
ఓరీ దేవుడో..మనం తింటున్న జీడిపప్పు నకిలీదా? కల్తీని కనిపెట్టాలంటే
ఓరీ దేవుడో..మనం తింటున్న జీడిపప్పు నకిలీదా? కల్తీని కనిపెట్టాలంటే
ఇక గూగుల్ పే, ఫోన్‌పే అక్కర్లేదు.. ఇక వాట్సాప్‌ నుంచే అన్ని..!
ఇక గూగుల్ పే, ఫోన్‌పే అక్కర్లేదు.. ఇక వాట్సాప్‌ నుంచే అన్ని..!
బిగ్ బాస్ హౌస్ లో జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఉగ్రరూపం.. వీడియో ఇదిగో
బిగ్ బాస్ హౌస్ లో జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఉగ్రరూపం.. వీడియో ఇదిగో
ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు
ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు
వీధి కుక్కల స్వైర విహారం.. కుక్క దాడిలో ఎద్దు మృతి.. రైతు ఆవేదన!
వీధి కుక్కల స్వైర విహారం.. కుక్క దాడిలో ఎద్దు మృతి.. రైతు ఆవేదన!