AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్లో స్వాతంత్య్ర దినోత్సవాలు.. రాష్ట్ర ప్రజలకు భద్రత ఉందన్న గవర్నర్

జమ్మూ కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం మొట్టమొదటిసారిగా 73 వ స్వాతంత్య్ర దినోత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. అయితే 144 సెక్షన్ వంటి నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. దీంతో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు, భద్రతా బలగాలు మోహరించే ఉన్నాయి. ఇక, శ్రీనగర్ లోని షేర్-ఏ-కాశ్మీర్ స్టేడియంలో గవర్నర్ సత్య పాల్ మాలిక్ జాతీయ జెండాను […]

కశ్మీర్లో స్వాతంత్య్ర దినోత్సవాలు.. రాష్ట్ర ప్రజలకు భద్రత ఉందన్న గవర్నర్
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Aug 15, 2019 | 12:35 PM

Share

జమ్మూ కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం మొట్టమొదటిసారిగా 73 వ స్వాతంత్య్ర దినోత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. అయితే 144 సెక్షన్ వంటి నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. దీంతో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు, భద్రతా బలగాలు మోహరించే ఉన్నాయి. ఇక, శ్రీనగర్ లోని షేర్-ఏ-కాశ్మీర్ స్టేడియంలో గవర్నర్ సత్య పాల్ మాలిక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రానికి స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసినప్పటికీ, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించారు. కేంద్రం చేసిన మార్పులను చరిత్రాత్మకమైనవిగా పేర్కొన్నారు. ఈ చర్యలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని, జమ్ముకశ్మీర్, లడక్ వారసత్వ సంస్కృతికి దోహద పడుతాయని అన్నారు. గత 70 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలతో వివిధ అంశాల్లో వేరుగా ఉన్నారని.. కాని ఇప్పుడాపరిస్థితి లేదని మాలిక్ చెప్పారు. కాగా, ఈ ఉత్సవాలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఇలా ఉండగా, ఈ స్టేడియం వద్ద స్టీల్ బ్యారికేడ్లతో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి ‘ మమ ‘ అనిపించారు. అటు-ఇప్పటికే మాజీ సీఎం లు మెహబూబా ముప్తీ, ఫరూక్ అబ్దుల్లా సహా కీలక నేతలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే రెచ్ఛగొట్టే ప్రసంగాలు చేస్తారని భావిస్తున్న స్థానిక నాయకులు కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. మాజీ ఐఏఎస్ టాపర్ షా ఫజల్ ని సైతం నిన్న హౌస్ అరెస్టు చేయడంతో.. అసలు భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రభుత్వం సంకెళ్లు వేసిందని విపక్షాలు దుయ్యబడుతున్నాయి.