విజయనగరం యువతి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. విచారణలో బయటపడ్డ అసలు డ్రామా..!

అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు హాస్టల్ నుంచి తప్పించుకుని కిడ్నాప్ డ్రామా ఆడింది.

విజయనగరం యువతి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. విచారణలో బయటపడ్డ అసలు డ్రామా..!
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 03, 2021 | 4:55 PM

woman kidnap drama :

ఘట్‌కేసర్ విద్యార్థిని అత్యాచారం డ్రామా లాంటి కట్టుకథే.. మరోకటి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి.. అసలు విషయం తెలుకుని షాక్ అయ్యారు. అయితే 48 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాజకుమారి సన్మానించారు. ఈ కేసులో అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు హాస్టల్ నుంచి తప్పించుకుని కిడ్నాప్ డ్రామా ఆడింది ఓ స్టూడెంట్. విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇక, పూర్తి వివరాల్లోకి వెళ్తే… విజయనగరం జిల్లా గుర్లలో రోడ్డు ప్రక్కనే ఉన్న తుప్పల్లో ఒక అమ్మాయి అరుపులు విని స్థానికులు భయంతో అక్కడకు వెళ్లారు. అయితే అప్పటికే ఆమెను ఎవరో తాళ్లతో చేతులు, కాళ్లు కట్టేసి పడేసి ఉంది. ఆ యువతి అపస్మారక స్థితిలో ఉండడంతో భయపడ్డ స్థానికులు మార్చి ఒకటవ తేదీన గుర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు.విషయం తెలియగానే హుటాహుటిన పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాళ్ళు, చేతులు బంధించి ఉన్న సుమారు 24 ఏళ్ల అమ్మాయిని గుర్తించారు. అప్పటికే యువతి పస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే స్థానికుల సహకారంతో గుర్ల పోలీసులు సపర్యలు చేసి. చికిత్స నిమిత్తం గుర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, అక్కడి నుండి విజయనగరం ఘోషాసుపత్రికి తరలించారు. అయితే, విషయం బయటకు రావడంతో విజనగరం వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అనుమానస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

అపస్మారక స్థితిలో ఉన్న యువతి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. ఆమె స్నేహితుల దగ్గర నుంచి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో అసలు డ్రామా బయటపడింది. తల్లిదండ్రులను నమ్మించేందుకే తనకు తాను కాళ్లు, చేతులు కట్టేసుకొని పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు యువతి నటించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో యువతిపై చీటింగ్ కేసు పెట్టిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది ఆ యువతి.

పాలకొల్లులోని తన బాయ్ ఫ్రెండ్‌ను కలిసేందుకు.. యువతి ఫిబ్రవరి 27న హాస్టల్ నుండి బాబాయ్ దగ్గరకు వెళతానని పర్మిషను తీసుకుంది. ఆమె బాబాయ్ ఇంటికని చెప్పి ఇంకా వెళ్లకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు హాస్టల్ లో ఆరా తీసినట్టు యువతి తెలుసుకుంది. ఇంటికి అని చెప్పి రాకపోతే కుటుంబసభ్యులు మందలిస్తారని భావించి డ్రామాను క్రియేట్ చేసింది. బాయ్ ఫ్రెండ్‌ను కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన పాలకొల్లు- పాలకొండ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తరువాత బస్సు దిగిన ఆమె.. రోడ్డు ప్రక్కన ఉన్న ఖాళీ ప్రదేశాన్ని గమనించింది. వెంటనే ఆమె తుప్పల్లోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులను, స్నేహితులను నమ్మించేందుకు తనకు తానే కాళ్ళు, చేతులను చున్నీతో కట్టుకుంది. అక్కడితో ఆగక అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించింది. తల్లిదండ్రులను నమ్మించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు హై డ్రామా క్రియేట్ చేసింది యువతి.

ఇదిలావుండగా, శనివారం చెట్ట పొదల్లో కాళ్లు, చేతులు కట్టేసి పడి ఉన్న యువతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో అసలు కథ బయటపడింది. సిసి ఫుటేజ్ తో ఇతర ఆధారాలతో నాటకాన్ని బయటపెట్టారు పోలీసులు. కాగా, ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. ఏది నిజమో? ఏదీ అబద్ధమో తెలియడం లేదు. ఏదీ ఏమైనా కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులను ఎస్పీ రాజకుమారి ఘనంగా సన్మానించారు.

ఇదీ చదవండిః Kidnap case in Tirupati: వీడని మిస్టరీ… తిరుపతిలో కిడ్నాప్ కేసు మిస్టరీ కొనసాగుతూనే ఉన్నది…