Andhra Pradesh: నీళ్ళ తొట్టిలో పడి మూడేళ్ళ బాలుడు మృతి.. చిన్న క్లూతో బయటపడ్డ తల్లి అసలు బండారం..!
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కన్నతల్లి కర్కశంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా మూడేళ్ళ కొడుకు ఉన్నాడనుకుందేమో కడతేర్చేసింది. ప్రియుడుతో కలిసి పక్కా ప్లాన్ అమలు చేసింది ఆ తల్లి. బాలుడిని అంత మొందిచడంలో కీలక పాత్ర పోషించిన ప్రియుడితో పాటు తల్లిని అరెస్ట్ చేసిన మదనపల్లి రూరల్ పోలీసులు జైలు పాలు చేశారు. మదనపల్లి మండలం చిప్పిలిలో జరిగిన ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కన్నతల్లి కర్కశంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా మూడేళ్ళ కొడుకు ఉన్నాడనుకుందేమో కడతేర్చేసింది. ప్రియుడుతో కలిసి పక్కా ప్లాన్ అమలు చేసింది ఆ తల్లి. బాలుడిని అంత మొందిచడంలో కీలక పాత్ర పోషించిన ప్రియుడితో పాటు తల్లిని అరెస్ట్ చేసిన మదనపల్లి రూరల్ పోలీసులు జైలు పాలు చేశారు. మదనపల్లి మండలం చిప్పిలిలో జరిగిన ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది.
ఫిబ్రవరి 13న చిప్పిలిలో మూడేళ్ల సాకేత్ ఇంట్లో నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. ఇదే నిజమని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది తల్లి మయూరి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. బాలుడి తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో.. ఆమెతో పాటు ప్రియుడు శంకర్ రెడ్డి పోలీసుల అడ్డంగా దొరికిపోయారు. సాకేత్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మయూరి, శంకర్ బండారం బయటపెట్టారు.
పులిచెర్ల మండలం కల్లూరు కు చెందిన నాగరాజుతో మయూరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్ల క్రితం వరకు నాగరాజు, మయూరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. వీరి మధ్యలో రెండేళ్ల క్రితం సదుం మండలం వెంకట దాసర్లపల్లి కి చెందిన శివ శంకర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. నాగరాజు లేని సమయంలో తరచూ ఇంటికి వస్తూ మయూరితో పరిచయం పెంచుకున్న శివ శంకర్ రెడ్డి ప్రేమాయణం కొనసాగించాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో సహా జీవనం చేసే దాకా వెళ్ళింది. దీంతో రెండేళ్ల క్రితం భర్తను వదిలి కొడుకు సాకేత్‌ను తీసుకుని ప్రియుడు శంకర్ రెడ్డితో వెళ్లిపోయింది మయూరి.
మదనపల్లి మండలం చిప్పిలిలో శంకర్ రెడ్డి మయూరి సహజీవనం ప్రారంభించారు. శంకర్ రెడ్డి మదనపల్లిలో కూలీ పనులు చేసుకుంటుండగా, మయూరి బిస్కెట్లు తయారీ పరిశ్రమలో పనిచేస్తూ సహజీవనం కొనసాగిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య మూడేళ్ళ సాకేత్ అడ్డుగా ఉన్నాడని భావించారు. అడ్డు తొలగించే ప్రయత్నం చేసిన శంకర్ రెడ్డి మయూరీలు పక్కా ప్లాన్ చేశారు. బాలుడిని తీవ్రంగా కొట్టి చంపిన శివ శంకర్ రెడ్డికి వత్తాసు పలికింది మయూరి. హత్య కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసింది. ప్రియుడు శంకర్ రెడ్డి తీవ్రంగా కొట్టడంతో అపస్పారక స్థితిలో పడిపోయి మృతి చెందిన మూడేళ్ల సాకేత్ ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. కొడుకు సాకేత్ ప్రమాదవశాత్తు నీళ్ళ తొట్టిలో పడి మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇక తమ వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డు లేకుండా పోయిందని భావించింది.
అయితే, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి సాకేత్ డెడ్ బాడీపై గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోస్టుమార్టం చేయించడంతో బాలుడిని హతమార్చినట్లు గుర్తించిన పోలీసులు మయూరితో పాటు ఆమె ప్రియుడు శివ శంకర్ రెడ్డి కుట్రను చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డు అనుకున్న కొడుకు ను హత మార్చిన తల్లి మయూరి, ఆమె ప్రియుడు శంకర్ రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రియుడి కోసం తల్లి చేసిన దారుణాన్ని బయటపెట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…