Hyderabad: స్నేహితుడని సాయం చేస్తే.. కొంప కూల్చేశాడు.. ప్రాణం తీసేశాడు
సాయం చేయబోతే సాంతం నాకేశాడు.. ఇదేంటని ప్రశ్నించినందుకు తోసేశారు. ఇంతలో ప్రాణామే పోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. నగర శివారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడ రాధాకృష్ణ నగర్ కాలనీలో ఈ దారుణం వెలుగు చూసింది.

52 సంవత్సరాల దశరథ అనే వ్యక్తి తన స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడని చలించిపోయాడు. ఆర్థిక ఇబ్బందులను కాపాడేందుకు తన ఇంటి డాక్యుమెంట్ ఇచ్చేశాడు. లోన్ తీసుకుని డబ్బులు కట్టుకుని సంతోషంగా ఉంటాడని భావించాడు. కానీ అప్పు చెల్లించిన తర్వాత తన డాక్యుమెంట్ తిరిగి ఇవ్వమన్న పాపానికి చుక్కలు చూపించాడు. ఏకంగా ప్రాణాలే తీశాడు.
అంతేకాదు స్నేహితుడు ఇచ్చిన డాక్యుమెంట్‌ను అడ్డంగా పెట్టుకుని మరొకరికి ఇంటినే అమ్మేశాడు కేటుగాడు. దీంతో ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు దాదాపుగా 20 మంది వ్యక్తులు వచ్చారు. ఇల్లు ఖాళీ చేయమని దశరథ్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తోపులాటలో కుప్పకూలిన రశరధ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో వచ్చిన వ్యక్తులు తిరిగి వెళ్ళిపోయారు. ఈ సంఘటన స్థలానికి వచ్చిన రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…