బెంగళూరు పోలీసు శాఖలో విషాదం.. స్నేహితురాలి ఇంట్లో సీఐడీ డీఎస్పీ ఆత్మహత్య.. కారణం అదేనా..?
బెంగళూరు సీఐడీ డీఎస్పీ లక్ష్మి (33) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న....

బెంగళూరు సీఐడీ డీఎస్పీ లక్ష్మి (33) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానకి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..2014 బ్యాక్‌కు చెందిన లక్ష్మి 2017లో నియమితులయ్యారు. లక్ష్మి ప్రస్తుతం పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్నేశ్వరి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో డీఎస్పీగా పని చేస్తున్నారు. అయితే తన స్నేహితురాలు ఇంటికి విందుకు వెళ్లిన లక్ష్మి.. అక్కడ గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకి లక్ష్మి బయటకు రానందున తలుపులు బద్దలు కొట్టడంతో ఉరివేసుకుని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను వెంటనే కిందికి దించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
కాగా, ఎనిమిది సంవత్సరాల కిందట వివాహం చేసుకున్న లక్ష్మికి సంతానం కలగలేదు. సంతానం కలుగలేదన్న నిరాశతో లక్ష్మి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఆత్మహత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. లక్ష్మిది కోలార్ జిల్లాలోని మలూరు తాలుకా మాస్తి గ్రామం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.