Crime News: భర్త చేసిన మోసం తట్టుకోలేకపోయిన భార్య.. ఇద్దరు పిల్లలతో కలిసి ఏం చేసిందంటే..?
కుటుంబ కలహాలతో ఇద్దరు చిన్నారులతో సహా వివాహిత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయి పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Family Suicide in Medak District: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు చిన్నారులతో సహా వివాహిత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయి పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దాదాయిపల్లి గ్రామానికి చెందిన కోటంగారి రజిత, రాజుకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరి అన్నోన్య దాంపత్య జీవితాన్నికి రజిత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఇటీవల ఆమెకు తెలిసిన నిజం భార్య-భర్తల మధ్య వివాదానికి కారణమైంది. భర్త రాజుకు ఇంతకు ముందే పెళ్లి అయిందని, తాను రెండో భార్యనని తెలియడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మరోసారి ఘర్షణ చోటుచేసుకోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన రజిత.. తన ఇద్దరు చిన్నారులైన రక్షిత, జశ్వంత్ లను తీసుకొని గ్రామ సమీపంలో ఉన్న గచ్చుకుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే, మంగళవారం ఉదయం కుంటలో ఇద్దరు చిన్నారులు నీటిలో శవమై తేలడం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. చెరువు వద్ద రజిత చెప్పులు ఉండడంతో ఆమె కూడా దూకిందనే అనుమానంతో గజ ఈతగాళ్లను సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. గతంలో కూడా భార్య, భర్తలు గొడవలు పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయని, ఇది ఆత్మహత్య కాదని హత్య చేసి ఉంటారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను జోగిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Read Also… Actress Shalu Chourasiya: శాలు చౌరాసియా పై దాడి కేసులో కీలక మలుపు.. పోలీసులు ఏం చెపుతున్నారంటే..