ఒరిస్సాలో దారుణం.. భర్త ఊరెళ్లి వచ్చేసరికి రక్తపుమడుగులో భార్య.. ఆమె మెడలో బంగారు నగలు మాయం..!

మహిళ మెడలోని బంగారు ఆభరణాల కోసం గొంతుకోసి హతమార్చారు.

  • Balaraju Goud
  • Publish Date - 5:07 pm, Sun, 24 January 21
ఒరిస్సాలో దారుణం.. భర్త ఊరెళ్లి వచ్చేసరికి రక్తపుమడుగులో భార్య.. ఆమె మెడలో బంగారు నగలు మాయం..!

Woman kills for Gold : ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు ఎంతటి దారుణాలకైనా వెనుకాడటంలేదు. డబ్బు, నగల కోసం ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. తాజాగా మహిళ మెడలోని బంగారు ఆభరణాల కోసం గొంతుకోసి హతమార్చారు. ఈ విషాద ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుభికొట పంచాయతీ పరిధిలోని హులకాతుండ గ్రామానికి చెందిన బిజయ్‌ హులుకా భార్య కొసాయి హులుకా(29)ను దుండగులు గొంతి కోసి ఆమె మెడలోని నగలతో ఉడాయించారు. బిజయ్‌ తన సొంత పనిమీద శుక్రవారం రాయగడకు వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగుల్లో తన భార్యపడి ఉండటం గమనించారు. బిజయ్ అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోపే హులుకా మృతి చెందింది. దీంతో కుంభికోట పొలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మృతురాలి గొంతు కోసి ఆమె మెడలోని బంగారు ఆభరణాలను దుండగులు అపహారించకు వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. అలాగే ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరిచి ఉండటంతో చోరి కోసమే హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also… Murder Caught On Camera: దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దారుణ హత్య.. సీసీ కెమెరాల్లో రికార్డ్..