Drugs Seized: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. ఇద్దరు విదేశీయుల అరెస్ట్..

Drugs Seized: డ్రగ్స్ ముఠా మరోసారి రెచ్చిపోయింది. నిషేధిత మాదక ద్రవ్యాలను దేశం నుంచి విదేశాలకు తరలిస్తూ అడ్డంగా బుక్కయ్యారు.

Drugs Seized: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. ఇద్దరు విదేశీయుల అరెస్ట్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 24, 2021 | 5:51 PM

Drugs Seized: డ్రగ్స్ ముఠా మరోసారి రెచ్చిపోయింది. నిషేధిత మాదక ద్రవ్యాలను దేశం నుంచి విదేశాలకు తరలిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు పట్టుకున్నారు. లగేజీ బ్యాగ్‌లో సీక్రెట్‌గా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను ఎయిర్‌పోర్ట్ అధికారులు గుర్తించారు. దుండగులు తమ వెంట తెచ్చుకున్న ట్రావెల్ బ్యాగ్‌ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లేస్‌లో డ్రగ్స్‌ను దాచిపెట్టారు.

అది గమనించిన అధికారులు బ్యాగ్‌ను చీల్చి అందులో ఉన్న 9.8 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు ఉగాండా దేశస్తులను ఎయిర్‌పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also read:

పంచాయితీ పోరుపై తొలగని టెన్షన్.. ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన క్షేత్రస్థాయి అధికారులు..!

IPL 2021 Auction: ముగిసిన ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువు.. మరోసారి వేలానికి సిద్ధమవుతున్న బీసీసీఐ