‘జైశ్రీరామ్ అని నినదిస్తే తప్పేమిటి ? ఆమెది హిందూ వ్యతిరేక మైండ్ సెట్’, మమతపై విశ్వ హిందూ పరిషద్ ఫైర్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా శనివారం కోల్ కతాలో జరిగిన కార్యక్రమంలో కొందరు 'జైశ్రీరామ్' అని నినాదాలు చేయడాన్ని..

'జైశ్రీరామ్ అని నినదిస్తే తప్పేమిటి ? ఆమెది హిందూ వ్యతిరేక మైండ్ సెట్', మమతపై విశ్వ హిందూ పరిషద్ ఫైర్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2021 | 5:52 PM

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా శనివారం కోల్ కతాలో జరిగిన కార్యక్రమంలో కొందరు ‘జైశ్రీరామ్’ అని నినాదాలు చేయడాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పు పట్టారని, కానీ ఇలా స్లొగన్స్ ఇచ్చినంత మాత్రాన తప్పేమిటని విశ్వ హిందూ పరిషద్ మండిపడింది. ఆమెది  హిందూ వ్యతిరేక మైండ్ సెట్ అని ఈ సంస్థ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ ఆరోపించారు. కేవలం ఒక వర్గాన్ని తృప్తి పరచేందుకు ఆమె ఈ నినాదాన్ని వ్యతిరేకించారని, కానీ ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఓ వర్గం జైశ్రీరామ్, మోడీ,మోడీ అని నినాదాలు చేయడంతో ఆగ్రహించిన మమతా బెనర్జీ.. మాట్లాడేందుకు నిరాకరించిన విషయం గమనార్హం. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని ఆమె అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను గౌరవించాల్సి ఉంటున్నారు. అటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కూడా మమతా బెనర్జీని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. మొత్తానికి ఇది బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య చిచ్ఛు రేపింది.