Voter ID: ఇకపై మొబైల్ ద్వారా ఓటరు ఐడీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రారంభం..
Voter ID Can Download From Mobile: ఇప్పటి వరకు ఓటరు గుర్తింపు కార్డు కావాలంటే మీ సేవ సెంటర్‌కు వెళ్లి ప్రింట్ అవుట్ తీసుకునే వారు. ఇది సమయంతో పాటు కొంత ఖర్చుతో కూడుకున్న విషయం. అయితే ఇప్పుడు ఓటర్లకు...
Voter ID Can Download From Mobile: ఇప్పటి వరకు ఓటరు గుర్తింపు కార్డు కావాలంటే మీ సేవ సెంటర్‌కు వెళ్లి ప్రింట్ అవుట్ తీసుకునే వారు. ఇది సమయంతో పాటు కొంత ఖర్చుతో కూడుకున్న విషయం. అయితే ఇప్పుడు ఓటర్లకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డును ఓటర్లు మొబైల్ ఫోన్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే నూతన విధానాన్ని భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. తమ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడంతో పాటు మొబైల్ ఫోన్‌లోనూ స్టోర్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న (సోమవారం) ఈ-ఎపిక్ (ఎలక్రానిక్: ఫొటో ఐడెంటిటీ ఓటరు కార్డు) కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించనుంది. 2021 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదైన యువ ఓటర్లకు తొలుత ఈ అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లందరూ ఈ-ఎపిక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఓటర్ ఐడీలను http://voterportal.eci.gov.in, NVSP: https://nsvp.in ద్వారా ఎలక్ట్రానిక్ ఓటరు గుర్తింపు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అంతేకాకుండా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్ల నమోదుకు విస్తృత ప్రచారం చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది.