Murder Caught On Camera: దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దారుణ హత్య.. సీసీ కెమెరాల్లో రికార్డ్..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్య జరిగింది. 45 ఏళ్ల రియల్ ఎస్టేట్ యజమాని హత్యకు గురైన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత బుధవారం పట్టపగలు..
Murder Caught On Camera: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్య జరిగింది. 45 ఏళ్ల రియల్ ఎస్టేట్ యజమాని హత్యకు గురైన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత బుధవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే రయిస్ అన్సారీ ఇంటి ముందే కొంత మంది దుండగులు అతడిని హత్య చేశారు. రయిస్ ను ఇద్దరు దుండగులు దగ్గరనుంచి కాల్చి చంపినట్లు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల్లో ఒకడిని అదపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
రయీస్ తన ఇంటి ముందు స్కూటర్ తుడుచుకుంటుండగా.. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరకు వెళ్లి హత్య చేయడానికి ప్రయత్నించారు. దుండగుల్లో ఒక వ్యక్తి జేబులోంచి తుపాకీ తీసి కాల్చేందుకు ప్రయత్నించగా.. రయిస్ అతని తోసి పరుగులు తీశాడు. అతడిని వెంబడించి కాల్చి చంపినట్లు సీసీ కెమెరాలో నమోదైన ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది.
Also Read: రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్న బంగ్లాదేశ్ త్రివిధ దళాలు.. విదేశీ అతిథి లేకుండా వేడుకలు