AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mandya Murders: సోదరి భర్తపై ఇష్టంతో.. ఐదుగురిని చంపేసింది.. ఆఖరుకు..?

కర్ణాటకలోని మండ్య జిల్లా శ్రీరంగపట్టణం కేఆర్‌ఎస్‌ గ్రామంలో ఈనెల 6న సంచలనం రేకెత్తించిన హత్య(Murders) కేసులను పోలీసులు ఛేదించారు. ఒకే కుటుంబానికి చెందిన...

Mandya Murders: సోదరి భర్తపై ఇష్టంతో.. ఐదుగురిని చంపేసింది.. ఆఖరుకు..?
Murder
Ganesh Mudavath
|

Updated on: Feb 10, 2022 | 7:47 AM

Share

కర్ణాటకలోని మండ్య జిల్లా శ్రీరంగపట్టణం కేఆర్‌ఎస్‌ గ్రామంలో ఈనెల 6న సంచలనం రేకెత్తించిన హత్య(Murders) కేసులను పోలీసులు ఛేదించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురవడం స్థానికంగా కలకలం సృష్టించింది. మైసూరు తాలూకా బెలవెత్త గ్రామానికి చెందిన సునీల్ భార్య లక్ష్మిని నిందితురాలిగా గుర్తించి అరెస్టు చేశారు. గంగారామ్‌ భార్య లక్ష్మి, ఆమె ముగ్గురు పిల్లలు రాజ్‌, కోమల్‌, కునాల్‌, అన్న కుమారుడు గోవింద హత్యకు గురయ్యారు. నిందితురాలు లక్ష్మి, మృతురాలు లక్ష్మి ఇద్దరూ వరుసకు అక్కాచెల్లెళ్లు. గంగారామ్‌ పై ఉన్న ఇష్టంతో నిందితురాలు లక్ష్మి.. గంగారామ్‌ నుంచి అతని భార్యను దూరం చేసేందుకు ప్రయత్నించింది. వారి మధ్య గొడవలు సృష్టించేందుకు విఫలయత్నం చేసింది. లాభం లేకపోవడంతో గంగారామ్‌ భార్యను చంపేయాలని నిర్ణయించింది.

చికెన్‌ కొట్టేందుకు ఉపయోగించే కత్తితో గంగారామ్‌ ఇంటికి చేరుకుంది. అర్ధరాత్రి వరకు లక్ష్మితో గొడవ పడింది. తెల్లవారుజామున మూడు గంటలకు లక్ష్మిపై విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేసింది. అలికిడికి నిద్ర లేచిన పిల్లలనూ అదే కత్తితో అంతమొందించింది. మృతదేహాలపై బ్లాంకెట్‌ పరిచి ఇంట్లో బీరువాలో ఉన్న దుస్తులను చెల్లాచెదురుగా పడేసి దొంగతనం జరిగినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అనంతరం అక్కడి నుంచి పరారైంది. మరుసటి రోజు రోదిస్తూ అంత్యక్రియల్లో పాల్గొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లక్ష్మిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వాస్తవాలు వెల్లడయ్యాయని జిల్లా ఎస్పీ ఎన్‌.యతీశ్‌ మీడియా వివరించారు.

Also Read

UP Assembly Election 2022 Phase 1 Polling Live Updates: ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ పోలింగ్ షురూ.. 58 స్థానాల్లో 623 మంది అభ్యర్థులు

Aa Ammayi Gurinchi Meeku Cheppali: సుధీర్ బాబు సినిమా నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట

Digital Beggar: ధర్మం చేయండి బాబయ్య.. చిల్లర లేకపోతే ఇలా చేయండయ్య.. నెటిజన్ల ఫిదా

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్