ఏంట్రా ఇలా తయారయ్యారు.. ప్రియుడి కోసం భర్తను.. కేసు మాఫీ కోసం మామను లేపేసింది..
ప్రస్తుత లవర్ కోసం భర్తను చంపడం ఒక ట్రెండ్‌గా మారింది. గత కొన్నిరోజులుగా ఈ ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ ఘటనలతో పెళ్లంటేనే యువత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ భర్తతో పాటు మామను కూడా చంపేసింది.

ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య.. ప్రియుడితో కలిసి ఉండేందుకు పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి.. గత కొన్ని రోజులుగా ఆందోళన కలిగిస్తున్న ఘటనలు ఇవి. ప్రస్తుత కాలంలో భర్తను చంపడం ఒక ట్రెండ్‌గా మారింది. పెళ్లై 20 ఏళ్లు అయ్యాక కూడా ప్రియుడి కోసం భర్తను చంపిన ఘటనలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇటీవల అమీన్‌పూర్‌లో లవర్‌తో ఉండాలనే ఆశతో ఏకంగా ముగ్గురు బిడ్డలను చంపేసింది ఓ మహిళ. అమ్మతనానికే ఈ ఘటన ఓ మచ్చగా మిగిలింది. మేఘాలయ హనీమూన్ మర్డర్ గురించి తెలిసిందే. హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించి ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడింది. ఈ క్రమంలో మరో దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కోసం భర్తను హత్య చేసిన కోడలు, ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్‌పై విడుదలై భర్త తండ్రిని కూడా హతమార్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.
బమ్రౌలి కటారాలో బబ్లీ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం హరి ఓమ్‌తో వివాహం జరిగింది. అయితే బబ్లీ తన భర్తను మోసం చేస్తూ ప్రేమ్ సింగ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్త హరి ఓమ్‌ను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ కేసులో ఆమెకు జైలు శిక్ష పడింది. కొన్నాళ్లకు ఆ దంపతుల కొడుకు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన కొడుకు, మనవడిని పొట్టనబెట్టుకున్న కోడలిపై హరి ఓమ్ తండ్రి రాజావీర్ సింగ్ న్యాయపోరాటం చేస్తున్నాడు.
సంధి పేరుతో మామ హత్య
ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన తర్వాత బబ్లీ కేసు విషయంలో రాజీ కుదుర్చుకోవడానికి తన మామ రాజావీర్ సింగ్‌ను మాట్లాడటానికి పిలిచింది. కానీ చర్చలను పక్కన పెట్టి అతన్ని కూడా హత్య చేసింది. ఈ ఘటనతో ఆ కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమైంది. పచ్చగా ఉండాల్సిన కుటుంబం కోడలి స్వార్థం, క్రూరత్వం వల్ల సర్వం కోల్పోయింది. రాజాసింగ్ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




